టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఈ ఏడాదిలోనే హైయెస్ట్ బజ్ నెలకొల్పిన సినిమా ఇది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి క్రేజ్ ఆకాశానికి అందుకుంది. మెల్లమెల్లగా సినిమా నుంచి వస్తున్న అప్డేట్ సినిమాపై మరింత హైప్‌ను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా ఓపెన్ బుకింగ్స్‌లోను సంచలనాలు సృష్టిస్తుంది. రిలీజ్‌కు ముందే పవన్ మానియా పాన్ ఇండియా లెవెల్‌లో రుజువైపోయింది. ఇప్పటికే ఉత్తరా అమెరికాలో టికెట్ సేల్స్ స్ట్రాంగ్ గా పెరుగుతూ వస్తున్నాయి. సినిమా రిలీజ్ ఇంకా 20 రోజులు ఉండగానే వన్ మిలియన్ టికెట్లు అమ్ముడుపోవడం విశేషం.
అయితే ఓ ఇండియన్ సినిమాకు రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో ఆదరణ దక్కడం ఇదే మొదటిసారి. ఇది పవర్ స్టార్ సరికొత్త రికార్డు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా కోసం ముందస్తు బుకింగ్లు మంగళవారం కొన్ని దేశాల్లో ప్రారంభించారు. అందులో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కూడా ఒకటి. ఇక అక్కడ.. ప్రపంచంలో రెండో పెద్ద స్క్రీన్ ఐమాక్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిన రెండు నిమిషాల్లోనే మొత్తం టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది సాధారణ రికార్డు కాదు. అయితే.. పవన్‌కు ఉన్న క్రేజ్.. సినిమాకు ఉన్న డిమాండ్ రిత్యా ఈ రేంజ్ లో సేల్స్ సాధ్యమయ్యయి. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇక.. నిన్న సాయంత్రం పవన్ ఫ్యాన్స్ మెల్బోర్న్ ఐమాక్స్ థియేటర్‌కు సంబంధించిన సిటింగ్‌లు కొన్ని స్క్రీన్ షాట్స్ ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంటూ.. టికెట్ బుకింగ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లో షో మొత్తం సేల్ అయిపోయిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఐమాక్స్ మేల్బోర్న్ స్క్రీన్ లో దాదాపు 461 సీట్లు ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ గా రికార్డు క్రియేట్ చేసిన ఇది బుకింగ్స్ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే ఫుల్ అయిపోవడం.. ఆ స్క్రీన్ షాట్ వైరల్ గా మారడంతో కేవలం తెలుగు రాష్ట్రాలేకాదు.. పాన్ ఇండియా లెవెల్ లో పవన్ క్రేజ్ ఇది అంటూ తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్.