పవన్ ” ఓజీ ” స్టోరీ లీక్.. ఆకిర రోల్ ఏంటంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రిలీజ్ కు మొత్తం సిద్ధమైంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్.. గ్లిప్స్, సాంగ్స్ తో బీభత్సమైన హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. ఈ నెల 25న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ రేంజ్ ఏంటో చూపించే సినిమా అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అసలు ఓజీ సినిమా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందని సుజిత్ వెల్లడించడంతో ఫ్యాన్స్ అదే ఫిక్స్ అయ్యారు. అయితే ఇండియాలోని ఓ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రివెంజ్ స్టోరీ నే ఈ సినిమా. కానీ ఎందుకు జపనీస్ భాషల్లో ఓజి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు, జపాన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు వాడాల్సి వచ్చింది.. జపాన్ నటులు యాక్ట్‌ చేయడం ఎందుకు.. ఇలాంటి ప్రశ్నల పై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అయితే.. ఓ ఇంటర్వ్యూలో మాత్రం సుజిత్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు జపాన్ అన్న, మార్షల్ ఆర్ట్స్ అన్న, ఆకీర కురుసోవ అన్న చాలా ఇష్టమంటు చెప్పుకొచ్చాడు.

ఆ ప్రభావం ఈ సినిమాలో కచ్చితంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని తనపై కూడా జపాన్ ప్రభావం చాలా ఉందంటూ వివరించాడు. అందుకే సినిమాలో ఇవన్నీ కనిపిస్తాయంటూ వివరించాడు. అయితే సినిమాలో అక్కడక్కడ మాత్రమే జపాన్ పోలికలు ఉంటే.. కచ్చితంగా ఇలా ఫస్ట్ లుక్ నుంచే ఈ ప్రమోషన్ జ‌పాన్ భాష‌తో మొదలవదు. కాగా.. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ జపాన్ భాషల్లో ఎందుకు రాసి ఉంది.. వాటిని ఇంగ్లీష్ అక్షరాల్లో చూస్తే భయ్యా.. సూటొమోగా కురు.. అని ఉంది. జపాన్ భాషలో దాని అర్థం.. ఫైర్ స్ట్రోమ్ ఇజ్‌ కమింగ్ అని. ఇక ఇదే సాంగ్‌గా కూడా రిలీజ్ చేశారు. సో ఫస్ట్ లుక్ నుంచే ఈ సినిమాకు జపాన్ పోలిక‌లు కనిపించడం క్లియర్ గా అర్థమవుతుంది. హీరో వాడే ఆయుధం కూడా జపాన్ సాంప్రదాయ యుద్ధ విద్యలో వాడే కటానా కావడంతో సినిమా.. కొంత భాగం జపాన్లో నడుస్తుంద‌ని టాక్‌.

అంతేకాదు గతంలో సుజిత్ మాట్లాడుతూ సినిమాలో జపనీస్ అంశాలు ఏవి సినిమాతో సంబంధం లేకుండా రావని సిచువేషన్ను బట్టి చూపించామని వివరించాడు. అంటే.. ఈ సినిమా జపనీస్ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుందని అర్థమవుతుంది. అంతేకాదు.. ఫస్ట్ సాంగ్ లో వాడిన జప‌నీస్ లిరిక్స్ యాకూబ్, సమురాయ్ అనే పదాలు జపాన్ కు సంబంధించినవే.. యాకుబ్ అంటే మాఫియా గ్యాంగ్ అని. వీరికి ఒక ప్రత్యేకమైన డ్రెస్సింగ్ స్టైల్, టాటూలు ఆచారాలు ఉంటాయి, శక్తి, గౌరవం, క్రూరత్వం ఇవన్నీ దానికి సింబల్స్. ఈ సినిమాలో కూడా పవన్ చేతి ఒక టాటూ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌కు.. టాటూ కు.. గ్యాంగ్స్టర్ కు మధ్యన లింక్ ఉంటుందని.. హీరో మధ్యలో ముంబై వదిలి జపాన్ కు వెళ్లి అక్కడ మాఫియా సిండికేట్ లో కలిసి పని చేస్తాడంటూ టాక్ నడుస్తుంది. ఇక సుమురాయ్ అంటే జపాన్ యోధులు వీళ్ళ మధ్యయుగ జపాన్లో రాజులను, భూస్వాములను రక్షించడానికి పనిచేసిన వాళ్ళు. మరి పవన్ నీ సుమరాయని వర్ణించడంతో దీనిపై మరింత క్లారిటీ వచ్చేసింది.

అయితే సినిమాలోని హీరోకు డైరెక్ట్ జపాన్తో ఏదో లింకు ఉన్నట్లు ఒక్క ఫీల్ అయితే క్రియేట్ చేశారు. అంతేకాదు.. ఈ సినిమాలో ఆఖీరా కూడా కనిపించాడని ఊహగానాలు తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ యంగేజ్‌ లుక్స్ లో అకీరా నటిస్తాడని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేకున్నా.. ఫైర్ స్ట్రామ్‌ సాంగ్ రిలీజ్ అయినప్పుడు మాత్రం.. కొన్ని లుక్స్ ఆకిరా లాగే కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఇదే వాస్తవమని ఫిక్స్ అయ్యారు. ఒకవేళ ఇదే నిజమైతే పవన్ ఎంగేజ్ లుక్‌లో అకిరా కనిపిస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఆఖీరా యంగ్ ఏజ్‌లో శత్రువుల మీద రివెంజ్ తీసుకుని జపాన్ వెళ్లిపోయి.. తర్వాత పెద్ద గ్యాంగ్ స్టార్ గా వెనక్కి ప‌వ‌న్ వచ్చి మిగిలిన పగ తీర్చుకుంటాడని.. ఇదే స్టోరీ అంటూ టాక్‌ నడుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ప్రస్తుతం ఈ స్టోరీ తెగ వైరల్ గా మారుతుంది.