నైజంలో దుమ్ము రేపుతున్న పవన్ OG.. నెవర్ బిఫోర్ రికార్డ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ఓజీ.. తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ లో హైప్ ను డబల్ చేసింది. ఈ క్రమంలోనే సినిమా ఓపెన్ బుకింగ్స్ లోను సంచలనాలు సృష్టించింది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో.. పవన్ కళ్యాణ్ టార్గెట్ ను రీచ్ అవ్వగలడా.. లేదా.. అనే విషయాలపై ఆసక్తి మొదలైంది. ఇక తాజాగా.. సినిమా రిలీజై హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి.

కంటెంట్ పెద్దగా లేకపోయినా విజువల్స్‌తోనే సినిమా నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది. పవన్ ఫ్యాన్స్ కు కావలసిన ఫుల్ మీల్ ఈ సినిమాతో వచ్చింది. ఇక.. తాజాగా ఓజీ సినిమా నైజాం ఏరియాలో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసుకోవడం విశేషం. నైజం ఏరియాలో ఓజీకి 366 కు పైగా ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇది నైజం లో ఆల్ టైం రికార్డ్ అంటూ మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. ఒక పోస్టర్ ద్వారా తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. భారీ లెవెల్ లో స్టార్ హీరో సినిమాల ప్రీమియర్ షోలు వేసిన సందర్భాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అంతేకాదు.. ఎన్ని ప్రీమియర్ షోలు వేసిన టికెట్ కౌంటర్ వద్దకు వచ్చేసరికి హౌస్ఫుల్ బోర్డ్ కనిపించింది.

అంటే.. పవన్ మానియా ఆడియన్స్ లో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాకు ఉన్న క్రేజ్, హాలిడేస్ లో సినిమా రిలీజ్ కావడం, టికెట్ హైక్, సినిమాకు ఇప్పటికే వచ్చిన టాక్.. ఇవన్నీ మరింత క‌లిసొచ్చాయి. ఈ క్ర‌మంలోనే.. ఈ సినిమాతో పవన్ ప్రభంజనం కాయమంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు ఒక్క‌ నైజాంలోనే రికార్డ్ లెవెల్ వస్తువులు ఖాయమని చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఓపెన్ బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసిన ఓజీ.. ప్రీమియర్ షో రికార్డులు ఫస్ట్ డే వసూళ్లు రాబోయే సినిమాలకు ఒక పర్ఫెక్ట్ బెంచ్ మర్క్‌ను క్రియేట్ చేస్తాడా.. లేదా చూడాలి.