ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన “ఓజీ” మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది. గ్యాంగ్స్ డ్రామా స్టైల్లో వచ్చిన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించగా, తమన్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ అయ్యింది. ముఖ్యంగా పవన్ ఎలివేషన్స్‌కి తగినట్టుగా తమన్ ఇచ్చిన బీజీఎమ్ అభిమానుల్లో గూస్‌బంప్స్ రేపుతోంది. థియేటర్ల దగ్గర కేరింతలు, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చూస్తే ఎక్కడ చూసినా ఇప్పుడు ఓజీ మేనియానే కనిపిస్తోంది.
ఇక ఈ ఓజీ క్రేజ్ బుల్లితెరపై కూడా ప్రభావం చూపుతోంది. అందులో భాగంగా ఒక సీరియల్ బ్యూటీ తన స్టైల్లో ఓజీ ఫ్యాన్ మోడ్‌ని బయటపెట్టింది. ఆమె మరెవరో కాదు.. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. స్టార్ మా లో ప్రసారమైన్న గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి తల్లిగా హుందాగా, పద్దతిగా కనిపించిన జ్యోతిరాయ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్‌గా అలరించడం స్టార్ట్ చేసింది. ఇటీవల వరుసగా హాట్ ఫోటోషూట్స్‌తో అందాల రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఓజీ ట్రెండ్‌లో భాగమై తన ఫోటోలు షేర్ చేసింది. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ పేరుతో ఉన్న క్రాప్ టాప్ వేసుకుని స్టైలిష్‌గా పోజులిచ్చిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సీరియల్లో ఎప్పుడూ చీరలో, పద్దతిగా కనిపించే జ్యోతిరాయ్.. ఇలా మోడర్న్ అవతారంలో కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram
“ఇది నిజంగానే జగతి మేడమా..? లేదా కొత్త హీరోయిన్ ఎవరైనా?” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు “స్క్రీన్‌పై పద్దతిగా, ఆఫ్‌స్క్రీన్‌లో గ్లామరస్‌గా.. రెండు వైపులా ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నావ్ జ్యోతిరాయ్” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ సినిమాపై ఉన్న క్రేజ్‌ని తన స్టైల్లో చూపించిన ఈ బ్యూటీ, మరోసారి ఫ్యాన్స్ దృష్టిని తనవైపు తిప్పుకుంది. మొత్తానికి.. ఓజీ మేనియా థియేటర్లలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా కొనసాగుతోంది. దానికి జ్యోతిరాయ్ లాంటి టీవీ బ్యూటీస్ కూడా తోడవ్వడంతో, సినిమా హైప్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి.