ఓజీ హిట్ తో సుజిత్ కు పవన్ మరో ఛాన్స్.. ఈసారి మూవీ కాదు..

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించాడు. ఈ క్రమంలోని సుజిత్ పేరు మారుమోగిపోతుంది. పవన్ కు వీరాభిమానిగా సుజిత్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాడని.. పవన్‌ను ఎలివేట్ చేసిన తీరు ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం ఆక‌ట్టుకుంటుంద‌ని అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అలా ఇప్పుడు సుజిత్ పవన్ కళ్యాణ్ పేర్లు తెగ వినిపిస్తున్నాయి.

ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరి కాంబో గురించినెటింట చర్చ కొనసాగుతుంది. ఓజీ సినిమా సక్సెస్ తర్వాత.. సుజిత్‌కు పవన్ స్వయంగా కాల్ చేసి అప్రిషియేట్ చేశాడని.. స్పెషల్ విషెస్ తెలియజేశారని టాక్ నడుస్తుంది. ఇందులో భాగంగా మ‌రో మెగా హీరోతో ఛాన్స్ కొట్టేశాడ‌ట సుజిత్‌. మెగా హీరోల‌తో సినిమా చేసే ఛాన్స్ చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. అది కూడా.. బిగ్ పాన్ ఇండియన్ స్టార్ రాంచరణ్‌తో సినిమా అవకాశమంటే అది సాధారణ విషయం కాదు. ఎన్నో సినిమాలు తీసాక, ఎన్నో హిట్స్ అందుకున్నాక, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉన్న దర్శకులకు మాత్రమే అలాంటి అవకాశం దక్కుతుంది.

రామ్ చ‌ర‌ణ్ - సుజిత్.. కాంబో సెట్ట‌య్యిందా? - Telugu360 Te

కానీ.. పవన్ త‌లుచుకుంటే అది చిన్న విషయం. అలాంటి మ్యాజిక్ సుజిత్ లైఫ్ లో పవన్ క్రియేట్ చేశాడట. పవన్ స్వయంగా సుజిత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు టాక్. మంచి కథను రెడీ చెయ్.. చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్ నేను ఇప్పిస్తా అంటూ సుజిత్‌కు పవన్ మాట ఇచ్చినట్లు సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదుగానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ వైర‌ల్‌గా మారడంతో.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. సుజిత్‌తో సినిమా అంటే.. ఈసారి చరణ్‌ను ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తాడు అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. మరి సుజిత్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇదే నిజమై చరణ్‌తో సుజిత్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం ఆయన పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని డైరెక్టర్గా మారిపోతాడు అనడంలో సందేహం లేదు.