” ఓజీ ” కోసం తన 20 ఏళ్ల రూల్ బ్రేక్ చేసిన పవన్.. మ్యాటర్ ఇదే..!

పవన్ కళ్యాణ్ నుంచి రానున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో ఒరిజిన‌ల్‌ గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెర‌వ‌నున్నారు. డివివి దాన‌య్య నిర్మించిన ఈ సినిమా.. మరో ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక పవన్ ఈ సినిమాలో ఓజాస్ గంభీర్ పాత్రలో మెరవనున్నాడు. ఈ క్రమంలోనే.. సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. ఇలాంటి క్రమంలో పవన్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్ అవుతుంది.

Pawan Kalyan And Priyanka Mohan's Song Suvvi Suvvi From OG Out, Fans React | Watch | Telugu Cinema News - News18ఓజీ కోసం.. దాదాపు 20 ఏళ్లుగా పవన్ ఫాలో అవుతున్న స్ట్రిక్ట్ రూల్స్ ఈ మూవీ కోసం బ్రేక్ చేశాడని తెలుస్తుంది. ఇంతకీ ఓజీ మూవీ కోసం పవన్ బ్రేక్‌ చేసిన ఆ రూల్ ఏంటో చూద్దాం. ఈ సినిమా సెప్టెంబర్ 25న‌ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్ర‌మంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఓజి కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 20 ఏళ్లుగా ఫాలో అవుతున్న రూల్‌ను బ్రేక్ చేశాడని అన్నాడు.

Thaman Shares a Key Music Update About Pawan Kalyan's OGఇంతకీ ఆ రూల్ మరెదో కాదు.. పవన్ రికార్డింగ్ థియేటర్‌లోకి ఎంటర్ ఇవ్వడం. దాదాపు 20 ఏళ్ల క్రితం అంటే ఖుషి సినిమా టైంలో రికార్డింగ్ థియేటర్‌లోకి వెళ్ళాడట పవన్. ఆ తర్వాత.. 20 ఏళ్లుగా ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చినా.. రికార్డింగ్ థియేటర్లోకి వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ.. ఇప్పుడు ఆ రూల్‌ బ్రేక్ చేసి.. ఓజీ సినిమా కోసం మళ్ళీ రికార్డింగ్ థియేటర్‌కి ఎంట్రీ ఇచ్చాడని థ‌మన్ వివరించాడు. ఓజీ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే మెయిన్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ స్వయంగా వీక్షించారని.. అవుట్ పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారంటూ థ‌మన్‌ వివరించాడు. ప్రస్తుతం థ‌మన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.