‘ OG ‘.. కేవలం 2 రోజుల్లో ఆ షూట్ కంప్లీట్ చేశారా

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా ఓజీ. ముంబై బ్యాక్‌ డ్రాప్‌తో.. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెర‌కెక్కింది. ఈ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజై.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కేవలం పవన్ అభిమానులు కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓజీ టీమ్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక నిన్న టీం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా.. సుజిత్‌ అటెండ్ అయి.. సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే సినిమా షూట్ జర్నీ గురించి మాట్లాడుతూ.

ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కీలకమైన సన్నివేశాలను కేవలం రెండు రోజుల్లోనే టీం కంప్లీట్ చేశామంటూ వివరించాడు. సినిమా కోసం బెస్ట్ అవుట్ పుట్ రావాలని ఎంతగా కష్టపడ్డాడో సుజిత్ చెప్పుకొచ్చాడు. మనం చేయాల్సిందల్లా ఆయన్ను నమ్మకంగా ఒప్పించడం.. కేవలం పవన్ నమ్మితే చాలు ఏం చేసేందుకు అయినా సిద్ధమైపోతారంటూ చెన్నుకొచ్చాడు. ఫస్ట్ డే.. హీరోయిన్ ప్రియాంక అరుళ్‌ మోహన్ పై వచ్చే లవ్ సీన్స్‌ని షూట్ చేశామని చెప్పుకొచ్చిన ఆయన.. అప్పుడే గ్యాంగ్ స్టార్ సినిమాలో లవ్ సీన్స్ ఎందుకు తీస్తున్నారని నన్ను అడిగారంటూ వివరించాడు.

OG Success Press Meet

అప్పుడు.. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఫాలోఅప్ చేస్తామని.. పవన్ కు హామీ ఇచ్చినట్లు వివరించాడు. రెండో రోజు ఓజస్ గంబీర్ బాంబే ఎంట్రీ సీన్.. కాలు పెట్టగానే వచ్చే వాటర్ సీక్వెన్స్ సన్నివేశాన్ని షూట్ చేశామని వివరించాడు. అంతేకాదు.. అదే రోజున ముంబై పోలీస్ స్టేషన్ సీన్ కూడా షూట్ కంప్లీట్ చేసేసామని.. మూడవరోజు మదురై పోలీస్ స్టేషన్ ఫస్ట్ హాఫ్, లాస్ట్ సీక్వెన్స్ కంప్లీట్ చేశామని చెప్పుకొచ్చాడు. ఇలా సినిమాకు హైలెట్ అయిన పోలీస్ స్టేషన్ సీన్స్ అన్ని కేవలం రెండు రోజుల్లోనే కంప్లీట్ చేశాడంటూ సుజిత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. దీంతో.. ఫ్యాన్స్ తెగ ఆనంద పడిపోతున్నారు. ఇక సుజిత్‌ చెప్పిన ఈ సీన్స్ అన్ని సినిమాల చాలా కీలకంగా మారాయి. కేవలం రెండు రోజుల్లో వాటన్నింటినీ కంప్లీట్ చేయడమంటే సాధారణ విషయం కాదు.. కంప్లీట్ చేసేందుకు ఎంత బాగా టీం ప్లాన్ చేసుకున్నారు.. క్లియర్గా అర్థం అవుతుంది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.