పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ మరో 5 రోజులలో పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియంస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్లో ఏర్పాటు చేశారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్లోనే థియేట్రికల్ ట్రైలర్ సైతం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ ఈవెంట్‌పై ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. ఇక మరో కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ తో పాటు మూవీ టీం అలాగే కొంతమంది స్పెషల్ గెస్ట్‌లు కూడా హాజరై సందడి చేయనున్నారట. వాళ్లలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డితో పాటు.. పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవిని పిలవాలని మొదట టీం భావించినా.. ఆయన ఇతర షూటింగ్స్ పనులలో బిజీగా ఉన్న క్రమంలో.. చిరు ఈవెంట్ కు రాలేకపోతున్నారు. అన్నదమ్ములను ఒకే స్టేజిపై చూడాలని అరటనడిన ఫ్యాన్స్‌కు ఇది కాస్త నిరాశ మిగిల్చిన.. ఈవెంట్ మాత్రం ఆడియన్స్‌లో హైప్ పెంచేలా ఉండనుందట.
ఇక ఎల్బీనగర్ స్టేడియంలోనే ఈవెంట్ ఏర్పాటు చేయడానికి కారణం.. ఫ్యాన్స్ ఎక్కువమంది పాల్గొనేలా ఓపెన్ స్టేడియం ఉండడమే. గతంలో వీరమల్లు సినిమా ఈవెంట్ కు శిల్పకళ వేదికను ఎంచుకున్న మేకర్స్ ఫాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచారు. ఈ క్రమంలోనే వేల సంఖ్యలో ఫ్యాన్స్ ఓజీ ఈవెంట్‌కు హాజరు కావ్వాలని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. ఆ క్రౌడ్‌ను బ్యాలెన్స్ చేసేలా.. తెలంగాణ ప్రభుత్వం దానికి సరిపడ పోలీస్ దళాని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈవెంట్ రేపు రిలీజ్ కానున్న సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.