టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్లో రూపొందిన సినిమా ఈ ఏడాది మొత్తంలోనే హై బజ్‌తో వస్తున్న సినిమా కావడం విశేషం. ఇక సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, థీం మ్యూజిక్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ని దక్కించుకున్నాయి. ఇక సినిమా నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక కంటెంట్‌ను రిలీజ్ చేస్తూనే ఉన్నారు టీం. అయితే.. ప్రారంభంలో సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ రేంజ్లో కిక్ మాత్రం మరే అప్డేట్ ఇవ్వడం లేదు. గ్లింప్స్ ఇచ్చిన కిక్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్కోర్ మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ ఆడియన్స్‌లోను సినిమాపై భారీ లెవెల్ లో ఆసక్తి మొదలైంది. ఇదంతా సినిమా హైప్‌కు ఓకే.
కానీ.. భారీ రేట్లకు బయర్ సినిమా కొనుగోలు చేయాలంటే కావాల్సింది ఇది కాదు.. అసలైన కంటెంట్ అనడంలో అతిశయోక్తి లేదు. టీజర్, ట్రైలర్ అదే రేంజ్ లో ఆకట్టుకోవాలి. పవన్ రియల్ యాక్షన్ ను అంతా ఎంజాయ్ చేయగలగాలి. సినిమా లైన్ తెలిసి ఉండాలి. అప్పుడే సినిమాపై అసలు హైప్ మొదలవుతుంది. కానీ ఇప్పటివరకు అలాంటి కంటెంట్ ఏది సినిమా నుంచి రిలీజ్ కాలేదు. ఇటీవల పవన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా టీజర్ అయిన రిలీజ్ చేస్తారని అంతా భావించారు. కానీ.. అది కూడా లేదు. ఇక ఇప్పుడు రిలీజ్ టైం మరింత దగ్గర పడుతుంది. కచ్చితంగా 9 రోజులు కూడా ఈ సినిమాకు లేదు. 24 మాక్సిమం ప్రీమియర్స్ పడిపోతాయి. అంటే.. 8 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది.
కనీసం నాలుగు రోజుల ముందు అయినా ట్రైలర్ రిలీజ్ చేయాలి. 20వ తేదీ నాటికి ట్రైలర్ వచ్చేయాలి. అలానే.. ఆల్మోస్ట్ సినిమా కంటెంట్ అంతా 21 నాటికి కంప్లీట్ చేసేసుకుని.. ఓవర్సిస్కు కూడా కాపీలు సప్లై అయిపోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మూవీ టీంతో పాటు.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఫుల్ బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ఆయనే ట్రైలర్, ఆర్ఆర్, మిక్సింగ్ అన్నిటికి బాధ్యత చూసుకోవడం.. బిగ్ డీలే. ఈ క్రమంలోనే క్షణం కూడా తీరకలేకుండా పనిచేస్తున్నాడని సమాచారం. ఏదైనా సరే మాస్ యాక్షన్‌తో చూపించాల్సి ఉంది. కట్ కట్ సీన్లు కాకుండా లెంగ్త్ సీన్లతో, ఫుల్ యాక్షన్ తో ఫాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా సినిమా రూపొందించాడా లేదా.. బయ్యర్లకు సినిమాపై ఏ రేంజ్లో నమ్మకాన్ని ఇస్తాడు.. తెలియాలంటే ట్రైలర్ డే కోసం వేచి చూడాల్సిందే.