పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఓజీ రూపొందిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు భారీ హైప్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా.. శుక్రవారం గ్రాండ్ లెవెల్ లో రిలీజై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే.. సినిమా మంచి కలెక్షన్లను కొల్లగొడుతూ దూసుకుపోతుంది. తెలుగు స్టేట్స్ లో అయితే పవన్ హవా నెక్స్ట్ లెవెల్ లో కొనసాగుతుంది. ఇదే రేంజ్లో ఓవర్సీస్, నార్త్ అమెరికాలో దుమ్ము రేపుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా కర్ణాటక, తమిళనాడు, కేరళలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఈ సినిమాకు రిలీజ్ అయిన మొదటి రెండు రోజులు బాలీవుడ్లో మాత్రం పెద్దగా కలెక్షన్లు దక్కలేదు. ఇక మూడవ రోజు నుంచి.. నార్త్ ఇండియాలో ఓజీ సందడి మొదలైపోయింది. రోజు రోజుకు ఓజీ సినిమాకు సంబంధించిన థియేటర్ల సంఖ్య అంతకంతకు పెంచుకుంటూ పోతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. పవన్ ఓజీ సినిమా.. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ అయిన క్రమంలో.. ఈ మూవీ సౌత్ ఓవర్సీస్ లోను ముందే ఊహించినట్లుగా థియేటర్ రిలీజ్ జరిగి.. మంచి వసూళ్లను కొల్లగొట్టింది. ఇప్పటికి అదే జోరు కొనసాగిస్తుంది కూడా. ఇక పాన్ ఇండియా సినిమాగా ప్రచారం చేసిన మేకర్స్ సినిమాను ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెటింగ్ ఉన్న నార్త్ ఇండియాలో రిలీజ్ చేయడంలో కాస్త తడబడ్డారని చెప్పాలి.
ఓటీటీతో కేవలం నాలుగు వారాలకే ఒప్పందం పెట్టుకోవడంతో ఈ సినిమా నార్త్ ఇండియాలో భారీ లెవెల్లో రిలీజ్ కు అవకాశం లేకుండా పోయింది. హిందీ బెల్ట్ లోనే మల్టీప్లెక్స్ రేంజ్లో ఏ మూవీ రిలీజ్ కావాలన్నా.. 8 వారాల టైం వరకు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు అసలు ఎవరు ఇవ్వరు. 8 వారాలు పూర్తిగా థియేట్రికల్ రన్ కొనసాగిన తర్వాతే.. ఏ సినిమా అయినా ఓటిటికి వెళుతుంది. కానీ.. ఓజీ సినిమా మాత్రం.. అన్ని భాషల్లో నాలుగు వారాలకి స్ట్రీమింగ్ హక్కులను ఇచ్చేయడం.. పెద్ద దెబ్బయిపోయింది. దీంతో నార్త్ మార్కెట్లో.. సత్తా చాటుకోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలింది. ఇక నార్త్ హిందీ వర్షన్ లో ఓపెనింగ్ డే అత్యల్పంగా సింగిల్ స్క్రీన్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాప్ లో దక్కించుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ ఆడియన్స్‌లోను సినిమా ఆసక్తిని పెంచడంతో.. థియేటర్లలో ఆడియన్స్ క్యూ కడుతున్నారు. దీంతో తప్పనిసరిగా హిందీ వర్షన్ కోసం థియేటర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం పడిందట. ఈ మేరకు మూవీ హిందీ వర్షన్ కోసం థియేటర్లను పెంచుకుంటూ పోతున్నారు. భారీ లెవెల్ లో బురింగ్స్జరగడంతో.. హిందీలో ఓజీ క్రేజ్ పెరిగింది. మొదటి రోజున హిందీలో కేవలం 556 థియేటర్లో.. 1574 షోలు మాత్రమే ప్రదర్శించగా.. రెండవ రోజు 777 థియేటర్లలో 2390 షోలకు ప్రదర్శనలు జరిగాయి. ఇక మూడవరోజు అయితే ఏకంగా 804 థియేటర్లలో 2499 షోలుగా ఓజిని ప్రదర్శించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక నాలుగో రోజున హిందీ వర్షన్ అయితే ఏకంగా 850 థియేటర్లలో 2500 షో లను స్క్రీన్ చేశారు. ఇలా నాలుగు రోజుల్లో థియేటర్ల సంఖ్య 300 వరకు పెరిగింది.