నార్త్ అమెరికాలో ” ఓజీ ” సరికొత్త ప్రభంజనం.. రిలీజ్ కు 5 రోజుల ముందే రేర్ రికార్డ్..!

ఏపి డిప్యూటీ సీఎం.. టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. మరో 5 రోజుల్లో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. దాదాపు నెల రోజుల క్రితమే నార్త్ అమెరికాలో ఓపెన్ బుకింగ్స్‌ను ప్రారంభించేశారు. ఇప్పటికే.. సినిమా అక్కడ బుకింగ్స్ వరంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తుంది. అయితే.. తాజాగా మరోసారి ఓజీకి కాసుల పంట పండిందని.. క్రేజి రికార్డ్‌ పవన్ తన కథలో వేసుకోనున్నాడంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. బుకింగ్స్‌ ప్రారంభమైన మొదటి రోజు నుంచి రికార్డు లెవెల్లో టికెట్లు సేల్‌ అవుతునే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో.. రిలీజ్‌కు ముందే.. సినిమా రెండు మిలియన్ డాలర్లు కొట్ట‌గొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా బడ్జెట్, అలాగే నార్త్‌ అమెరికన్ ప్రీమియర్ కలెక్షన్ల లెక్కలు వైరల్ గా మారుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించిన టాప్ ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. సుజిత్ డైరెక్షన్‌లో ఓజీ రూపొందింది. ప్రియాంకా అరుణ్ మోహన్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా టాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఈ క్ర‌మంలోనే సినిమాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్.. ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలుపుకొని రూ.250 నుంచి రూ.300 కోట్ల మేర బడ్జెట్‌తో రూపొందింది. ఇక నార్త్ అమెరికాతో కలిపి.. ఓవర్సీస్‌లో సుమారు రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఓపెన్ బుకింగ్స్ లో అమెరికా, కెనడాలో భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది.

రికార్డ్‌ లెవెల్లో కలెక్షన్లు కొల్ల‌గొడుతూ.. అందరికి షాక్‌ కలిగిస్తుంది. కల్కి, పుష్ప 2, దేవర సినిమాలకు దీటుగా వసూళ్లు సంపాదించుకుంటుంది. అమెరికాలో ఓజి అడ్వాన్స్ బుకింగ్ బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభిస్తుంది. సుమారు 470 లొకేషన్ లలో స్ట్రీమింగ్ చేసేందుకు అంత సిద్ధం చేశారు. దాదాపు 2050 షోలను స్క్రీన్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే అమెరికాలో 62,000 టికెట్లు అమ్ముడు పోగా.. ప్రీవియస్ కోసం 1.8 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.16 కోట్ల వరకు వసూలు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కెన్నడలో సినిమాకు మరింత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందట. సినిమా కోసం ఇప్పటికే 25 వేల డాలర్ల మేర వసూలు నమోదు కాగా.. అమెరికా, కన్నడ తో కలిపి 1.95 మిలియన్ డాలర్లు అంటే రూ.17 కోట్లకు పైగా వసూలు వచ్చేసాయి. ఇంకా రిలీజ్‌కు ఐదు రోజులు ఉండగానే.. రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో ఓజి చేరుకోవడానికి సిద్ధమైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.