టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి థియేటర్ల వద్ద సందడి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఏ క్రమంలోనే ఫ్యాన్స్ పై అభిమానంతో.. పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత కూడా సమయం దొరికినప్పుడల్లా సినిమాలకు కేటాయిస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాడు. అలా.. తాజాగా పవన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఆయన కెరీర్‌లోనే మునుపెన్నడు లేని రేంజ్‌లో ఈ సినిమాపై హైప్ మొదలైంది. సుజిత్ డైరెక్షన్‌లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా.. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెరవనున్నారు.
ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇది కేవలం ఓ యాక్షన్ సినిమా గానే కాదు.. పవన్ మాస్ ఎంటర్టైనింగ్, స్టైలిష్ లుక్స్, ఫైట్స్, థమన్ మ్యూజిక్, ముంబై విజువల్స్ అన్నింటినీ కలుపుకొని సినిమాకు హైప్ మరింతగా పెరిగిపోయింది. టీజర్, ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచేసాయి. ఇక.. ఈ సినిమాకు తాజాగా యూ\ఏ సర్టిఫికెట్ రద్దుచేసిన సెన్సార్ టీం.. ఏ సర్టిఫికెట్లు అందించింది. అంటే కేవలం 18+ వాళ్లు మాత్రమే సినిమాలు చూసే అవకాశం ఉంది. ఇక సినిమాకు 8 కట్స్ విధించి.. 1 నిమిషం 55 సెకండ్లు ఫుటేజ్ ను తొలగించారని టాక్.
ఇక సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్‌లో కాస్త టెన్షన్ మొదలైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూ\ఏ సర్టిఫికెట్‌లో సినిమా చూసిన పవన్ యాక్షన్ ఫుల్ మోడ్ లో చూడలేము అని.. డిసప్పాయింట్ అయిన అభిమానులు.. సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన యాక్షన్ అవతార్ పూర్తి రేంజ్‌లో చూడొచ్చని.. సినిమాలో బ్లడ్ బాత్ ఎంజాయ్ చేయొచ్చని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు చూపిస్తున్న ఓజీ ఓపెనింగ్ రోజున మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.