టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే తన నటటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటించి.. మురారి, ఒకడు, అతడు ఇలా అన్నింటితో సక్సెస్‌లు అందుకుని తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అప్పటినుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్‌లో దూసుకుపోతున్న మహేష్. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో.. పాన్ వరల్డ్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ క్రమంలోనే.. మహేష్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్‌కు అత్యంత సన్నిహితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు. వీళ్ళిద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి మొదలైంది. ఈ క్రమంలోనే వీళ్ళ మధ్యన మంచి బాండింగ్ కూడా బలపడింది. అలా ఇప్పటికీ పలు సందర్భాల్లో వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. కాగా.. మహేష్ తన కెరీర్‌లో మొదటిసారి తన కొడుకు కోసం పవన్ ను కలిసినట్లు తెలుస్తుంది. గౌతమ్ విషయంలో పవన్ సలహాలు తీసుకున్నాడట మహేష్.
ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. గౌతమ్ కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని ప్రయత్నాల్లో మహేష్ ఉన్నాడట. దానికోసం పవన్ ని కలిసిన ఆయన ఎలా ట్రై చేస్తే బాగుంటుంది.. ఏం చేద్దాం అని పవన్ తో చర్చించాడట. ఏదేమైనా మహేష్ తన కొడుకుని హీరోగా రంగంలోకి దింపాలని కష్టపడుతున్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటినుంచే కొడుకుకి మార్షలాట్స్ నేర్పించి.. వీలైనంత త్వరగా అతన్ని హీరోగా అన్ని విధాల సిద్ధం చేయాలని ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇక మహేష్ కొడుకు కోసం పవన్ సలహా తీసుకున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారడంతో అటు మహేష్ అభిమానులతో పాటు.. ఇటు పవన్ అభిమానులు కూడా ఆనందపడుతున్నారు.