టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి నట వారసుడిగా చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో ఎదిగాడు. మెల్లమెల్లగా అవకాశాలను దక్కించుకుంటూ స్టార్ హీరోగా మారాడు. తను ఎంచుకున్న కథలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో చరణ్ గొప్పతనాన్ని అభిమానులు కూడా చాలా గర్వంగా చెప్తూ ఉంటారు. ఇక చరణ్ నుంచి చివరిగా వచ్చిన గేమ్ ఛేంజర్.. ఊహించిన రేంజ్లో సక్సెస్ అందుకోకపోయినా.. ఆయన క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. కాగా.. ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబు డైరెక్షన్లో ఒక క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమాలో.. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ సినిమా తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో మరో పాన్ ఇండియన్ ప్రాజెక్టులో నటించనున్నాడు. ఈ సినిమా వైవిధ్యమైన కాన్సెప్ట్.. అద్భుతమైన టేకింగ్ తో చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్లేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో తెరకెక్కిన రంగస్థలం ఏ రేంజ్లో సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబో సినిమాపై కూడా ఆడియన్స్ లో మంచి హైప్ మొదలైంది. కాగా.. ఇలాంటి క్రమంలో తాజాగా చరణ్ మరో సంచలన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఆయన ఫ్యూచర్ లైన్ అఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ టాక్ నడుస్తుంది. ఇక చరణ్.. లోకేష్ కనకరాజు డైరెక్షన్లో యాక్షన్ ఫిలిం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. లోకేష్ కనకరాజ్ యాక్షన్ సినిమాల్లో తనకంటూ ఒక స్పెషల్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు. ఈ క్రమంలోనే వరుస సక్సెస్ లను కూడా అందుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు చరణ్ లోకేష్ తో సినిమా చేస్తున్నాడు అంటూ టాక్ నడుస్తున్న క్రమంలోనే సినిమాపై హైప్ మొదలైపోయింది. అంతేకాదు.. రామ్ చరణ్ ఇప్పటికే కేజిఎఫ్ సిరీస్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్లతో పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోనూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. చరణ్ సినిమాను కూడా నీల్ అదే రేంజ్లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వీళ్ళిద్దరితో పాటే.. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెన్సేషనల్ క్రేజ్‌ను సంపాదించుకున్న సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో చరణ్ ఓ సినిమా నటించనున్నాడని తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగ సినిమాలలో ఇంటెన్స్ స్టోరీస్, పవర్ఫుల్ క్యారెక్టర్జేషన్స్ ఉంటాయి.
ఈ క్రమంలోనే ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు విమర్శలు అందుకున్నా.. బ్లాక్ బస్టర్ సక్సెస్ లు దక్కించుకుంటున్నాయి. ఇక రాంచరణ్‌తో సందీప్ చేస్తున్న సినిమా సైతం అలాంటి ఇంటెన్స్ స్టోరీ. నాని, చరణ్ పాత్ర పవర్ఫుల్ గా ఉండనుందని తెలుస్తుంది. ఈ సినిమాపై ఆడియోస్లో ఇప్పటికే పాజిటివ్ వైస్ మొదలయిపోయాయి. ఇలా.. చరణ్ వరుసగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు టాప్ మోస్ట్ దర్శకులతో సినిమాలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే చరణ్లైనప్ నెటింట టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సెట్స్‌పైకి వచ్చి.. సక్సెస్ అయితే చరణ్ ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్లో డబుల్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబుల్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న రికార్డ్ కూడా సొంతమవుతుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అభిమానులు సైతం ఈ ప్రాజెక్టుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.