గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. బాక్స్ ఆఫీస్ దగ్గర భీరీ కలెక్షన్లు కొల్లగొటి.. సంచలనం సృష్టించిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుందని.. మొదట మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించినా.. ఇటీవల ఈ రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ మేకర్స్ ఓ నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
కాగా.. తాజాగా బాలయ్య రిలీజ్ డేట్ పై ఓ హీంట్ ఇవ్వడం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఓ ఈవెంట్లో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ అఖండ 2 రిలీజ్ డేట్ పై రియాక్ట్ అయ్యారు. ఈ ఏడది డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందంటూ ఆయన వెల్లడించారు. అయితే ఏ తేదీ అనేది మాత్రం ఆయన రివీల్ చేయలేదు.
డిసెంబర్ 5న శుక్రవారం కావడంతో.. అదే రోజున సినిమా రిలీజ్ అవుతుందని టాక్ మాత్రం.. ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. అయితే.. సినిమా ఏ కాస్త ఆలస్యమైనా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక బాలయ్యకు సంక్రాంతి సీజన్ అంటేనే బ్లాక్ బస్టర్ సీజన్. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్లోనే ఉంటుందా.. సంక్రాంతికి షిఫ్ట్ అవుతుందా.. అనే విషయం క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.