పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. కొద్దిసేపటి క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అయితే.. ఇప్పటికే ప్రీమియర్‌స్ ముగించుకున్న ఈ సినిమా యబో యావరేజ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక రిలీజ్‌కు ముందే.. భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. ఓపెన్ బుకింగ్స్‌తోనే రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ బుకింగ్‌లో రూ.100 కోట్లు కలెక్షన్ కొల్లగొట్టిన ఓజీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంపై ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. మొదటి రోజు ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేనుందో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ఇలాంటి క్రమంలో ఈ సినిమా కోసం.. మరో రెండు సినిమాలు తమ సినిమాను త్యాగం చేసినట్లు టాక్ నడుస్తుంది. సెప్టెంబర్ 25న అనుష్క ఘాటీతో పాటు.. 90 బయోపిక్ ఫేమ్ మౌళి హీరోగా మెరిసిన లిటిల్ హార్ట్స్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ లిటిల్ హాట్ సినిమాకు సక్సెస్ రేట్ ఎక్కువగా వచ్చింది. సినిమా థియేటర్లో ఫుల్ రన్ లో మంచి కలెక్షన్లు కలగొట్టింది. ఇప్పటికి చాలాచోట్ల థియేటర్లో సినిమా రన్ అవుతూనే ఉంది. అటు.. నిర్మాతలకు భారీ లాభాలు దక్కుతున్నాయి. అయితే.. ఇలాంటి టైం లో ఓజీ కోసం ఈ సినిమాను థియేటర్లో యాజమాన్యం పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. ప్రజంట్ తేజ సజ్జ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకుపోతున్న మిరాయ్ సినిమా ధియేటర్లను కూడా చాలా చోట్ల ఓజీ కోసం త్యాగం చేసినట్లు సమాచారం.
లిటిల్ హార్ట్స్ మిరాయ్ సినిమాలకు ఇప్పటికీ మంచి అదరణ.. ప్రేక్షకుల్లో లభిస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలో ఓజీ కోసం సినిమాలు థియేటర్ నుంచి తప్పించడం అందరికీ షాక్ ను కలిగించినా.. మేకర్స్ ఇష్ట ప్రకారమే ఇది అంతా జరుగుతుందట. ఇక లిటిల్ హార్ట్స్ విషయంలో అయితే.. స్వయంగా నిర్మాత బన్నీవాస్ దీనిని ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఇప్పటివరకు మేము సినిమాకు కోపరేట్ చేస్తూనే వచ్చాం.. ఇప్పుడు ఓజీ ప్రీమియర్ షోల కోసం లిటిల్ హర్ట్స్ బయర్లు కోపరేట్ చేయండి.. ఓజీ ప్రీమియర్లకు గరిష్ట మద్దతునివ్వండి.. పవర్ స్టార్ సినిమాను మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం అంటూ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఏకంగా రెండు సినిమాలకు అన్యాయం జరిగిందంటూ వస్తున్న కామెంట్లకు ఇది సరైన సమాధానం. ఇప్పటికే బడా బడా స్టార్ హీరోస్ తో పాటు దర్శక, నిర్మాతలు సైతం ప్రమోట్ చేశారు. ఇంతకీ ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ను జరుపుకున్న ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.