2025: ఇంకా రూ.500 కోట్ల టార్గెట్ రీచ్ కానీ టాలీవుడ్.. ఓజితో సాధ్యమా..?

ఇటీవల కాలంలో టాలీవుడ్.. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని పొందుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సినిమాలను కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియా లెవెల్‌లో పలు భాషల్లో సినిమాలు రిలీజై మంచి సక్సెస్‌లు అందుకుంటున్నాయి. అలాగా.. గ‌తేడాది బాక్స్ ఆఫీస్ దగ్గర టాలెంట్ చూపించిన టాలీవుడ్.. ఈ ఏడాది మాత్రం ఒక్క సరైన హిట్ కూడా దక్కించుకోలేక డీలా పడిపోతుంది. గతంలో కల్కి, పుష్ప 2తో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన టాలీవుడ్.. దేవర 2తో రూ.500 కోట్ల మార్క్‌ క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలా 2024లో ఈ రేంజ్ లో కలెక్షన్లు కల్లగొట్టిన టీ టౌన్.. ఈ ఏడాది మాత్రం రూ.1000 కోట్లు కలెక్షన్లు పక్కన పెడితే.. కనీసం రూ.500 మార్క్‌ను కూడా టచ్ చేయలేకపోతోంది.

బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాల‌తో ఈ రికార్డ్ బ్రేక్ అయింది. కోలీవుడ్‌లోను కూలి సినిమాతో రూ.500కోట్ల టార్గెట్‌ను రీచ్ చేశారు. ఇక హాలీవుడ్‌లో ఈ ఏడాది ఓజీ వండర్స్‌ను క్రియేట్ చేస్తుంది. లూసీఫ‌ర్ 2, లోక లాంటి చిన్న సినిమాలు రూ.250 ప్లస్ కలెక్షన్లతో ఆల్ టైం రికార్డ్‌ల‌తో దూసుకుపోతుంది. టార్చ్ బ్యారెర్లుగా.. గతంలో ఓ వెలుగు వెలిగిన టాలీవుడ్ మాత్రం.. ఈ ఏడాది టాస్క్ కంప్లీట్ చేయడంలో డీలాపడిపోయింది. ఇప్పటికే ఈ ఏడాదిలో బోలెడన్ని టాలీవుడ్ సినిమాలో రిలీజ్ అయ్యాయి. కానీ.. ఓ రిజనల్ మూవీగా తెర‌కెక్కిన సంక్రాంతికి వస్తున్నం సినిమా కలెక్షన్స్ కూడా ఆ పాన్ ఇండియ‌న్ సినిమాలను టచ్ చేయలేకపోయాయి. రూ.300 కోట్లతో.. 2025లో హైయెస్ట్ గ్రస‌ర్‌గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచిపోయింది. అంతేకాదు.. వెంకీ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాస్ కాలగొట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.

కనీసం పాన్ ఇండియన్ సినిమాలు కాదు కదా.. ఒక్క లోకల్ సినిమా కూడా ఈ తొమ్మిది నెలల్లో ఆ రికార్డును టచ్ చేయలేక పోయింది. బిగ్ నెంబర్ కోసం ఎంతగా ట్రై చేసిన 200 కోట్లను మించి అందుకోలేకపోయాయ్యి. ఇక టాలీవుడ్‌కు ఈ ఏడాదిలో కేవలం మూడు నెలలు మాత్రమే మిగిలింది. ఈ మూడు నెలల్లో సత్తా చాటుకుంటుందా.. లేదా.. తెలియాల్సి ఉంది. ఇక ఏడాది కచ్చితంగా ఈ టార్గెట్ ను రీచ్ అవుతుందని నమ్మకం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ఆడియన్స్ లో కలిగింది. ఈ సినిమా కేలం ప్రీమియర్స్‌తోనే ప్ర‌పంచవ్యాప్తంగా.. వంద కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. అంతేకాదు.. మొదటి రోజే ఏకంగా రూ.167 కోట్లు సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే.. ఓజి సినిమా లాంగ్ రన్ లో రూ.500 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడం పెద్ద కష్టమేమీ కాదంటూ టాక్‌ తెగ వైరల్‌గా మారుతుంది. మరి.. ఈ ఏడాది రూ.500 కోట్ల మార్క్‌ టచ్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తుందా.. లేదా.. వేచి చూడాలి.