వార్ 2 ట్విట్టర్ రివ్యూ.. తారక్ పర్ఫామెన్స్ అదరగొట్టాడా..!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా కొద్ది నిమిషాల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్.. అలాగే ప‌లు ప్ర‌ధాన‌ పట్టణాల్లో ప్రీమియర్ షోస్‌ సైతం ముగించుకుంది. ఇక.. ఆయన ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు..కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసింది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా.. కొద్దిసేపటి క్రితం ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.. ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో మెప్పించిందో ఒకసారి చూద్దాం.

ఎన్టీఆర్ తన పర్ఫామెన్స్‌తో సినిమా రేంజ్ డబ్బులు చేశారంటూ చెప్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయని.. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్స్, మాస్ ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకున్నాయంటు చెబుతున్నారు. ఎన్టీఆర్ సన్నగా ఉన్నాడని అంటున్నారు కానీ.. ఆయన ష‌ర్ట్ లెస్ షార్ట్‌స్ పర్ఫామెన్స్ రాంపాడేసాడ‌ని.. ఎన్టీఆర్ అభిమానులకు ఈ షార్ట్స్ ఫుల్ కిక్కిస్తాయ‌ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాలిడ్ ఎంటర్టైన‌ర్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

వార్ 2 ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉందని.. హృతిక్, ఎన్టీఆర్ ల ఎంట్రీ గూస్ బంప్స్ అంటూ చెబుతున్నారు. యాక్షన్ గ్రాండ్ గా ఉంది. కానీ.. కొన్ని సన్నివేశాలు స్లోగా సాగాయని.. ఎంగేజింగ్ గా మాత్రం అనిపించలేదు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వెల్ వరకు సినిమాకు బ్లాక్ బస్టర్ వైబ్స్‌ వచ్చినా.. సెకండ్ హాఫ్ ఆడియన్స్‌లో పెద్దగా ఆకట్టుకోలేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. స్ట్రాంగ్ క్లైమాక్స్‌తో సెకండ్ హాఫ్ గ్రాఫ్ అమాంతం పెరిగిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పోస్ట్ క్రెడిట్ సన్నివేశాల కోసమైనా కచ్చితంగా సినిమాను చూడొచ్చని.. తారక్, హృతి క్ మధ్యన వచ్చే యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద స్ట్రాంగ్ ఎంటర్టైనర్ అని సినిమా థియేటర్లలో చూడొచ్చు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మొదటి భాగం మెప్పించింద‌ని చెప్పుకొచ్చిన నెటిజన్స్.. ఎన్టీఆర్, హృతిక్ ఎంట్రీ అదిరిపోయిందని.. సినిమా ప్రారంభంతో ఆకట్టుకున్నా.. తర్వాత రెగ్యులర్ టెంప్లెట్ స్పై ఫిలిం మోడల్ లోకి వెళ్లిపోయిందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్రేక్ తర్వాత సినిమా సెకండ్ హాఫ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని.. ఇరు హీరోల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఆకట్టుకుంటుంది అంటూ వివరిస్తున్నారు.

మ‌రికొంద‌రు ఫస్ట్ అఫ్ యావరేజ్ అని.. సెకండ్ హాఫ్ తలనొప్పిగా ఉందంటూ షాకింగ్ రివ్యూస్ ఇచ్చారు. చాలా స్ట్రేంజ్‌ మూమెంట్స్ ఉన్నాయని.. ఒక్క అవుట్డేటెడ్ కథ‌ అంటూ.. స్క్రీన్ ప్లే వీక్ గా ఉందని, డైలాగ్స్ కూడా పెద్దగా మెప్పించలేదంటూ.. త‌మ‌ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు బడా స్టార్ హీరోస్ కూడా సినిమాను సేవ్ చేయలేకపోయారని.. ఈ సినిమా ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ డిసప్పాయింటెడ్ మూవీ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫైన‌ల్‌గా తార‌క్, హృతిక్ ప‌ర్ఫార్మెన్స్, ఎంట్రీ, యాక్ష‌న్‌, కియారా.. పాత్ర‌ నడివి మేరకు గ్లామర్ షోతో ఆకట్టుకుందని.. సలాం అనాలి సాంగ్‌లో తారక్‌, హృతికి ఇద్దరు ఒకరికి ఒకరు టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారని.. నాటు సాంగ్ తో కంపేర్ చేసే రేంజ్ లో మాత్రం సాంగ్ లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఊపిరి ఉయ్యాలగా సాంగ్ విజువల్స్ మెప్పించాయట. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ ఆకట్టుకుందని.. హాలీవుడ్ మూవీ చూసిన ఫీల్ ఉంది. డబ్బింగ్ యావరేజ్ డైలాగ్స్ చాలా వరకు సెట్ అయ్యాయి అంటూ.. సినిమాలో హీరో ఎవరు.. విల‌న్‌ ఎవరు.. ఎన్టీఆర్ క్యారెక్టర్ షేడ్స్‌ ఏంటనేది మాత్రం థియేటర్లలో చూడాల్సిందే.