టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, యాక్షన్ బిట్స్ చూడాలని అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో వార్ 2 మూవీ స్టోరీ ఏంటి.. ఇటీవల కాలంలో వచ్చిన స్పై యూనివర్సిటీ సినిమాలన్నీ ఒకే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నాయి అంటూ టాక్ కూడా వైరల్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పఠాన్ మూవీ స్టోరీ చూస్తే ఓ నిజాయితీగా పనిచేసే వ్యక్తి.. ఇండియన్.. పాకిస్తాన్ టెర్రరిస్టులకు క్లిష్ట సందర్భాల్లో పట్టుబడిపోతాడు. అప్పటినుంచి పగ పెంచుకున్ని దేశానికి శత్రువుగా మారి హాని తలపెట్టాలని ప్రయత్నిస్తాడు.
అతని నుంచి మన దేశాన్ని కాపాడే వాడిగా పాఠాన్ మెరిసాడు. వార్ 2 స్టోరీ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుందని.. ఎన్టీఆర్ మన దేశానికి శత్రువుగా మారిపోతే అతని అడ్డుకునేందుకు హృతిక్ వచ్చాడంటూ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే.. అసలు స్టోరీ అది కాదట. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అన్నదమ్ములుగా కనిపించనున్నారని సమాచారం. ఓకే తండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లలు.. కానీ తల్లులు వేరు. అంటే సవతి కొడుకుల మధ్య స్ట్రాంగ్ వార్ స్టోరీగా ఇది రూపొందింది. ఇక వీళ్లిద్దరి మధ్యన శత్రుత్వం ఏర్పడడానికి గల కారణాలు.. ఎన్టీఆర్ వైపు న్యాయం ఉందా.. లేదా హృతిక్ వైపు న్యాయం ఉందా.. చివరికి వారిలో ఎవరు గెలిచారు. అనే అంశాలన్నీ సినిమాలో చాలా ఆసక్తిగా చూపించనున్నారు.
ఫ్యాన్స్ కచ్చితంగా థ్రిల్ అయ్యేలా ఈ సినిమాలో చాలా అంశాలు ఉంటాయని సమాచారం. ఇక.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్యన వచ్చే సలాం అనాలి సాంగ్ అయితే సినిమాకి హైలెట్గా నిలవనుందని టాక్ నడుస్తుంది. ఆడియన్స్‌లో ఈ సింగ్ అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. కానీ.. అది చిన్న బిట్ మాత్రమే. సాంగ్ ఫుల్ గా చూడాలంటే వెండితెరపై వీక్షించాల్సిందేనని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ పాట నాటు నాటును మించిపోయి ఉంటుందని థియేటర్స్ లో ఫ్యాన్స్.. ఈలలు, చప్పట్లతో మోత మోగిపోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో తప్ప దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రారంభమై సంచలనం సృష్టిస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ బుకింగ్స్ ప్రారంభమై ఎలా అమ్ముడుపోతాయో చూడాలి.