వార్ 2 ప్రీమియర్ రివ్యూ.. ఎన్టీఆర్ బాలీవుడ్ డబ్యూ ఎలా ఉంది..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా కొద్దిసేపటి క్రితం భారీ అంచనాల న‌డుమ రిలీజై అయ్యింది. ఆగస్ట్‌ 14న గ్రాండ్ లెవెల్ లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు ముగిశాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మొదటిసారి ఓకే స్క్రీన్ పై ఆడియన్స్‌ను పలకరించనున్నారు. వార్‌ ఫ్రాంచైజ్‌ల‌పై ఆడియన్స్ ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే.. వార్ 2 పై ఆడియన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. అయాన్ ముఖర్జీ సినిమాకు డైరెక్టర్గా.. కీయారా అద్వానీ హీరోయిన్గా మెరుస్తుండగా.. రూ.400 భారీ బ‌డ్జ‌ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా.. లేదా.. ఆడియన్స్ ఏ రేంజ్లో థ్రిల్ చేసిందో సోష‌ల్ మీడియా రివ్యూ లో చూద్దాం.

మొద‌ట‌.. జపాన్లో జరిగే హృతిక్ రోషన్ యాక్షన్ ఎపిసోడ్‌తో సినిమా ప్రారంభమైంది. ఇక.. తర్వాత చాలా సేపు కథను నడిపించిన డైరెక్టర్.. సినిమా మొదలైన 40 నిమిషాల తర్వాత తారక్ ఎంట్రీ చూపించాడు. ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చేలా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ అదరగొట్టింది అంటున్నారు. ముందుగా.. ఊహించినట్లుగానే సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలతో ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుంది. ఇక తారక్.. హృతిక్‌కు మధ్య కాంపిటీషన్ గా సాగిన సన్నివేశాలు సినిమాకు నెక్స్ట్ లెవెల్‌లో హైలెట్గా నిలిచాయి. కొన్ని సీన్స్ మరింత ఉత్కంఠ భరితంగా చూపించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్, హృతిక్ జపాన్ యాక్షన్ సీన్, ఎన్టీఆర్ ఎంట్రీ సీన్స్ ని డైరెక్టర్ చాలా డీటెయిలింగ్‌గా చూపించారు. ఇక స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయినా.. ఫస్ట్ హాఫ్‌లో రొటీన్ గా అనిపించే సీన్స్.. చాలానే ఉండడం సినిమాకు కాస్త మైనస్. కథలో కొత్తదనం లేకపోయినా.. యాక్షన్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. విజువ‌ల్స్‌ పెద్దగా మెప్పించలేదు.

కానీ.. పర్ఫామెన్స్‌తో ఆదరగొట్టారు. ఇంటర్వెల్ బ్్యాంగ్‌ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సలాం అనాలి సాంగ్‌కు స్క్రీన్ ప్లే మెప్పించకపోయినా.. ఇద్దరు స్టార్ హీరోల పర్ఫామెన్స్ అదరగొట్టారు. కొందరు ఆడియన్స్ ఫ‌స్ట్ హ‌ఫ్ యావరేజ్ గా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ చాలా వరకు ఆకట్టుకున్నా.. కానీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బడ్జెట్‌కు తగ్గ రేంజ్ లో అయితే కనిపించలేదు. ఎమోషనల్ డెప్త్‌ కూడా అయాన్ ముఖర్జీ ప్రభావితంగా చూపించలేకపోయాడు. యాక్షన్స్ స‌న్నివేశాలు మాత్రమే ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నా.. ఓవరాల్ గా ఇంటర్వెల్ మంచి ట్రీట్‌తో ఎండ్ చేసిన అయాన్ ఫస్ట్ హ‌ఫ్ యావరేజ్‌గా నడిపించినా.. సెకండ్ హాఫ్‌తో కాస్త గ్రాఫ్ ను పెంచుకున్నాడు. సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ మాత్రమే ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా సీన్స్ పెట్టారు. యాక్షన్ సీన్స్ కోసం పడ్డ కష్టం సినిమాల కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. ఎమోషనల్ సీన్స్ యావరేజ్ గా.. అంతేకాదు అయాన్‌ చాలా చోట్ల సేఫ్ గేమ్ ఆడినట్లు అనిపిస్తుంది. దీంతో ఇప్పటివరకు వస్తున్న ట్విట్టర్ రివ్యూలను బట్టి వార్ 2 మూవీ యావరేజ్ టాక్ ను దక్కించుకుంది.