వార్ 2 ఫుల్ రివ్యూ.. తారక్, హృతిక్ హిట్ కొట్టారా..!

పాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ ఎవైటెడ్‌గా రూపొందిన సినిమాల్లో బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 ఒకటి. బాలీవుడ్ గ్రీక్‌వీరుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై.. రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి హైప్‌ మొదలైంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు ఎదురుచూపుకు ఎట్టకేలకు తెరపడింది. నేడు ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్‌ కాగా.. తాజాగా ఫస్ట్ షో ముగించుకుంది. ఇక సినిమా ఆడియన్స్‌ని ఎలా ఆకట్టుకుంది.. తారక్‌, హృతిక్ తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను థ్రిల్ చేశారా.. లేదా.. రివ్యూ లో చూద్దాం.

స్టోరీ:
చాలా రొటీన్స్ స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్ గా కథ మొదలైంది. అజ్ఞాతంలో ఉన్న హృతిక్ రోషన్‌ను కనిపెట్టడానికి ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లను నియమించింది గవర్నమెంట్. అయితే.. హృతిక్‌ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు.. ప్రతిసారి హృతిక్‌ మిస్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇండియన్ పోలీసులంతా కలిసి స్పై ఆఫీసర్ గా ఎన్టీఆర్‌ను ఎంచుకుంటారు. హృతిక్ ను కనిపెట్టడానికి పంపిస్తారు. ఇంతకీ వీళ్లిద్దరి మధ్యన ఏం జరుగుతుంది.. ఎన్టీఆర్.. హృతిక్ ని పట్టుకున్నాడా.. లేదా.. ఇద్దరిలో ఎవరు హీరో.. ఎవరు విలన్.. అనేది తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే.

రివ్యూ:
ఇక గ‌తంలో వ‌చ్చిన అన్ని సినిమాల లానే.. చాలా రొటీన్ స్టోరీతో అయాన్‌ ముఖర్జీ.. వార్ 2ను రూపొందించాడు. ఇప్పటికే స్పై యాక్షన్ థ్రిల్లర్‌లుగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఈ క్రమంలోనే.. య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై గతంలో తెర‌కెక్కిన వార్, పఠ‌న్‌ సినిమాలు సైతం ఇదే మోడల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందాయి. కాగా.. వార్ 2 సినిమాకు మాత్రం ఒక స్పెషలైజేషన్ విజువల్స్‌తో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్ళెం దుకు ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల గ్రాఫిక్స్ ఓవర్ అయింది. అది ఫుల్ గ్రాఫిక్స్ అన్ని.. కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. ఇద్దరు హీరోల పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నా టెక్నికల్‌గా మరింత ఇంప్రూవ్మెంట్ ఉంటే.. సినిమా బాగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంట్రీ సీన్స్ చూపించిన తీరులో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న అయాన్.. యాక్షన్, డ్యాన్స్ సీన్స్ డిజైనింగ్ లోను తనదైన స్టైల్‌తో మెప్పించాడు. ఇక సినిమా ఫస్ట్ హ‌ఫ్‌లో కొన్ని సన్నివేశాలు ఆడియన్స్‌ను ప్రభావితం చేసినా.. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్‌గా అసలు డెప్త్ చూపించలేకపోయాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని.. ఇద్దరి మధ్యలో వచ్చే ఫైట్ సీక్వెన్స్‌లు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఇక ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లలో వచ్చే ట్విస్టులు సైతం ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ విషయంలోనే మరికాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది అన్న ఫీల్.. ఆడియన్స్ లో కలిగింది. దానికి తగ్గట్టుగానే ఎమోషనల్ సీన్స్ మరింత ఇంప్రూవ్మెంట్ ఇచ్చి ఉంటే సినిమాపై ప్రభావం కనిపించేది. ఇక హృతిక్ రోషన్ ఇప్పటివరకు లేని ఎవర్ బిఫోర్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. తారక్ పూర్తిగా వచ్చే సీన్స్ లో ఒకరికి ఒకరు పోటీపడి మరి నటించారు. ఈ క్రమంలోనే సినిమా ఓవరాల్‌గా యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్నా ఇంకాస్త ఎఫెక్ట్ గా ఉంటే బాగుండేది.

నటీనటుల పర్ఫామెన్స్:
ఇక ఎన్టీఆర్ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే తన పాత్రల్లో జీవించేసాడు. యాక్షన్ సీన్స్ లో ఎన్టీఆర్ ను చూస్తే ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఖాయం అనిపించేలా ఒదిగిపోయినటించాడు. ఇక హృతిక్ సైతం.. త‌న‌ కెరీర్‌లోనే నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న ఫీల్ ఆడియన్స్ లో కలుగుతుంది. తనకున్న పాత్ర న‌డివిలో గ్లామర్ షో తో పాటు.. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టింది. హాట్ ప్రియులకు.. అమ్మడి బికినీ సీన్స్ వచ్చినప్పుడు విజిల్స్ మోత మోగిపోయింది. ఇక ఇతర ఆర్టిస్టులు సైతం తమ పాత్ర ఇంపార్టెన్స్ ను బట్టి మెప్పించారు.

Kiara advani bikini in war 2 : Kiara Advani first bikini shoot got excited  as soon as the 'War 2' - YouTube

సాంకేతికంగా:
టెక్నికల్గా సినిమా మ్యూజిక్ యావరేజ్ గా అనిపించింది. ఇంకాస్త బెటర్ గా ఉంటే కచ్చితంగా సినిమాపై దాని ప్రభావం ఉండేది. ఏ సినిమా అయినా ఎమోషనల్, యాక్షన్ సీన్స్ లో బిజిఎం కీలక పాత్ర వహిస్తుంది. అలాంటిది మూవీలో ఆ మ్యాజిక్ మిస్ అయినట్లు అనిపించింది. ఒక సినిమాకు న్యాచురల్.. రియలెస్టిక్ స్టోరీ ఉంటే.. డైరెక్టర్ చెప్పిన కదా ఆడియన్స్ పై ప్రభావం చూపిస్తుంది. కానీ.. విజువల్స్ పరంగా.. గ్రాఫిక్స్ పరంగా.. అక్కడక్కడ ఓవర్ కావడంతో సినిమాకు అది మైనస్ గా మారింది. కొన్ని సన్నివేశాలు అయితే యానిమేషన్ లో ఎలా అయితే బొమ్మలతో ఫైట్ చేస్తారో.. అలాంటి ఫీల్ వచ్చింది. ఎడిటర్ కత్తెరకు కూడా మరి కాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. కొన్ని ల్యాగ్ సీన్స్‌ కట్ చేసి ఉంటే బాగుండేది. స్టోరీ గ్రిప్పింగా అనిపించేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించాయి.

ప్లస్ లు, మైనస్ లు:
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పర్ఫామెన్స్ సినిమాకు ప్లస్ అయింది. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్, యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ మెప్పించాయి. సినిమాలో మ్యూజిక్ బిగ్ మైనస్. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఆడియన్స్‌కు క‌నెక్ట్ కాలేదు. గ్రాఫిక్స్ అని కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది. ఈ క్రమంలోనే సినిమాకు విజువల్ గా కూడా కాస్త మైనస్ అయింది.

War 2 Movie Review and Release Live Updates: The Hrithik Roshan, Jr NTR  starrer collected Rs 16 crore gross in advance bookings - The Times of India

రేటింగ్: 3/5