టాలీవుడ్ గాడ్ ఫాదర్ @70: హ్యాపీ బర్త్డే చిరంజీవి..

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్‌ ఇమేజ్‌కు పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్టార్ హీరోగా ఎదిగి.. టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా మారిన చిరు సినీ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. ఇక చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు చిరంజీవి 70వ‌ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చిరుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి, మొగల్తూరు జిల్లాలో జన్మించిన చిరు.. చిన్నతనం నుంచే నటనపై ఉన్న ఆసక్తితో చదువు పూర్తి చేసిన వెంటనే న‌ట‌న‌ శిక్షణ తీసుకున్నాడు. 1976లో శిక్షణను ప్రారంభించిన ఆయన.. 1978లో పునాదిరాళ్లు సినిమాతో హీరోగా మారాడు. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా కంటే ముందే తను నటించిన మరో మూవీ ప్రాణం ఖరీదు సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకుంది.

బాపు డైరెక్షన్‌లో వచ్చిన మన ఊరి పాండవులు సినిమాతో చిరంజీవికి మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. హీరో కంటే ముందు పలు సినిమాల్లో.. విలన్ గా నటించిన ఆయన.. తన నటన‌తో.. ద‌ర్శ‌క, నిర్మాతలను ఆకట్టుకున్నాడు, తనువైపు తిప్పుకున్నాడు, ఈ క్రమంలోనే హీరోగాను మారి వరస సక్సెస్లు అందుకున్నాడు. ఎన్టీఆర్‌, కృష్ణ, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలో.. సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి తన నటనతో ఆకట్టుకుని ఆ రేంజ్‌లో సక్సెస్ అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఇక అప్పట్లోనే.. బ్రేక్ డ్యాన్స్‌తో సినీ ఇండస్ట్రీని కొత్త పుంత‌లు తొక్కించిన ఘేన‌త చిరుకే ద‌క్కుతుంది. చిరంజీవి స్టెప్పులతో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేశారు.

Interesting Update On Mega 157 Title Announcement

కేవలం మాస్ యాక్షన్ సినిమాల్లోనే కాదు.. హాస్య ప్రదాన పాత్రలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస‌ బ్లాక్ బ‌స్టర్‌ల‌ను అందుకుంటూ ఉత్తమ నటుడుగా ఎన్నో అవార్డులను దక్కించుకున్న చిరుకి.. తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకు వెన్న తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కేవలం స్పెషల్ రోల్స్‌, మాస్, యాక్షన్, కామెడీ రోల్సే కాదు.. 2001 లో వచ్చిన శ్రీ మంజునాథ, అలాగే 2013లో శ్రీ జగద్గురు ఆది శంకర సినిమాలోని శివుడు పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పటికి ఆయన సినీ ప్రస్థానం కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా భోళా శంకర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఆయన.. త్వరలోనే మెగా 157 సినిమాతో పాటే.. విశ్వంభర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక నేడు పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.