టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరుపదల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాల్లోనూ సత్తా చాటుకుంటున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో బజ్ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది అఖండ లాంటి సంచలన బ్లాక్ బాస్టర్ సీక్వెల్ కావడంతో అఖండ 2 పై అంచనాలు ఆకాశానికంటాయి. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కోసం ట్రేడ్ వర్గాలతో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాతో బాలయ్య కెరీర్‌లోనే క్రేజి రికార్డ్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక సీనియర్ హీరో సినిమాకు ఈ రేంజ్‌లో బజ్ క్రియేట్ అవ్వడం.. ఇంత స్కేల్ రావడం లో బజ్ రావడానికి మరో ప్రధాన కారణం బడ్జెట్ కూడా. పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకునే రేంజ్‌లో సినిమాను రూపొందిస్తున్న క్రమంలో.. దాదాపు ఈ సినిమాకు రూ.180 నుంచి రూ.200 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు టీం. ఓ సీనియర్ హీరో సినిమాకు ఈ రేంజ్ బడ్జెట్ అంటే అది పెద్ద రికార్డ్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయిన టీం.. విస్తృత స్థాయిలో సినిమాను రిలీజ్ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఓ సీనియర్ స్టార్ హీరో సినిమాకు ఏ రేంజ్ లో బడ్జెట్ పెట్టడం అంటే రికవరీ పై సందేహాలు అందరిలోనూ కామన్. కానీ.. అఖండ 2కి ఇప్పటికే బిజినెస్ ద్వారా మంచి నెంబర్ వచ్చేసిందని అంటున్నారు. ఇక సాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్ అన్నింటిని కలుపుకొని సాలిడ్ రెవిన్యూ కాయమని టాక్. బాలయ్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడం.. బ్లాక్ బస్టర్ అఖండ సీక్వెల్ కావడం.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో రూపొందడం, యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. ఇప్పటికే క్రియేట్ అయిన ఈ బ్రాండ్.. అఖండ2 తో డబుల్ చేస్తారని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు, దానికి తగ్గట్టుగానే సినిమాలు నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ తో ఫ్యాన్స్ లో మరింత ఎక్సైట్మెంట్ పెరిగింది, అభిమానులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఫుల్‌గా ఉన్నాయని క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే అఖండ 2 రిలీజై.. ఫస్ట్ షో తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. ఇక బాలయ్య బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ పక్క. బాలయ్య కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ రికార్డ్ గా నిలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.