టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు.. సినీ లవర్స్ అంతా మోస్ట్ ఎవెయిటెడ్‌గా ఎదురు చూస్తున్న మూవీ ఓజి. హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌పై ఆడియన్స్‌లో సినిమా ప్రారంభమైన రోజు నుంచే మంచి హైప్ నెలకొంది. కారణం పవన్ లాంటి సూపర్ స్టార్.. న్యూ ఏజ్ కంటెంట్ ఉన్న సినిమాతో.. మంచి టాలెంట్ డైరెక్టర్లు ఎంకరేజ్ చేయడమే. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటూ.. చాలా కేర్ఫుల్ గా సినిమాను రూపొందిస్తున్నాడు సుజిత్. ఇక 2023 పవన్ బర్త్ డే సందర్భంగా సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి.. ఆడియన్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకున్నారు మేకర్స్.
ఈ క్రమంలోనే.. సినిమా అంతకంతకు ఆలస్యం అవుతున్నా.. ఇప్పటికీ ఇండస్ట్రీ మొత్తం సినిమా పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక.. రీసెంట్గా సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ అయితే.. ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించింది. నెక్స్ట్ లెవెల్ లో సునామీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సాంగ్ పైనే చర్చలు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సాంగ్ కంపోజింగ్‌పై, థమన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ రేంజ్‌లో అద్భుతమైన క్వాలిటీతో సాంగ్ ఇటీవల కాలంలో వినలేదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ఇలాంటి ఛార్జ్ బస్టర్ సాంగ్ పడి చాలా కాలం అయ్యిందంటూ చెబుతున్నారు. ఇక రెండు చెవుల్లో.. ఇయర్ బర్డ్స్ పెట్టుకొని ఈ సాంగ్ వింటే వచ్చే కిక్క వేరనడంలో సందేహంలేదు.
అలాగే థియేటర్స్‌లో ఈ సాంగ్ ఫీలయిన ఆడియన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఈ పాటని ప్రసాద్ మల్టీప్లెక్స్ లోని బిగ్ స్క్రీన్ ఈసీఎక్స్ లో ప్రతిరోజు.. ఇంటర్వెల్ టైం లో ప్లే చేస్తుండగా థియేటర్లో ఉన్న సౌండింగ్ సిస్టంకి.. థమన్ అందించిన బిట్స్‌కి ఎక్కడ థియేటర్ డిటిఎస్‌లు కాలిపోతాయి అని ఆపరేటర్ భయపడిపోతున్నాడట. అంతేకాదు.. ఆడియన్స్ నుంచి సౌండ్ తగ్గించమని రిక్వెస్ట్ లు కూడా వచ్చయట. ఇక ఇదే విషయాన్ని మోహన్ కుమార్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. తన ఫోన్ లో అదే సాంగ్‌ను పదే పదే వింటూ ఉండడంతో.. దయచేసి ఫోన్ వాల్యూమ్ తగ్గించాల్సిందిగా నోటిఫికేషన్ కూడా వచ్చాయని.. ఓ స్క్రీన్ షాట్ ని షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోహన్ కుమార్ పోస్ట్ నెటింట సంచలనం గా మారింది.
#Firestorm effect 😄😄@MusicThaman 🔥🔥🔥🔥#OG #TheyCallHimOG #TheyCallHimOGFirstSingle pic.twitter.com/UTHUB6TdGc
— Mohan Kumar (@ursmohan_kumar) August 5, 2025