” ఓజి ” విలన్ రోల్ మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చేసుంటే బాక్సాఫీస్ బ్లాస్టే..!

ఏపీ డిప్యూటీ సీఎం.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి త్వరలో రిలీజ్ కానున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శ‌ర‌వేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ హ‌ఫ్‌కి సంబంధించిన వర్క్ ఎడిటింగ్ తో సహా పూర్తయిపోయిందని.. సెకండ్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా.. రీసెంట్ గానే సినిమా నుంచి రిలీజ్ అయిన ఫైర్ స్ట్రామ్‌ సాంగ్.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. హరిహర వీరమల్లు రిజల్ట్‌తో నిరాశ వ్యక్తం చేసిన అభిమానులకు ఇది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అనడంలో సందేహం లేదు.

కాగా.. ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ కు అన్నగా కిక్ శ్యామ్, వదిన పాత్రల్లో శ్రేయ రెడ్డి మెర‌వనున్నారు. నిజానికి ఈ రెండు క్యారెక్టర్ల‌ కోసం ముందుగా మోహన్‌లాల్, టబ్బును భావించారట. కానీ.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తనకున్న పొలిటికల్ కమిట్మెంట్స్‌తో సమయాన్ని కేటాయించలేన‌ని.. మధ్య మధ్యలో సినిమాలకు బ్రేక్ పడొచ్చని.. ఆలోచించుకోమని సుజిత్ కు వివరించాడట. ఈ సినిమా కోసం పెద్దపెద్ద ఆర్టిస్టులను తీసుకొని ఒకవేళ సినిమా బ్రేక్ పడితే మళ్లీ డేట్ సర్దుబాటు అవ్వడమే కష్టం అయిపోతుందంటూ చెప్పుకొచ్చాడట పవన్. దీంతో.. టాప్ యాక్టర్స్ తో కాకుండా పెద్దగా డిమాండ్ ఉన్న న‌ట్టులతో సినిమాను పూర్తి చేసేయాలని ఫిక్స్ అయ్యారు టీం. అయితే.. అన్ని క్యారెక్టర్ల కోసం బలమైన స్టార్ కాస్టింగ్‌ను అనుకున్న సుజిత్.. డెసిషన్ మార్చుకుని.. పవన్ తండ్రి రోల్ కోసం ప్రకాష్ రాజును సెలెక్ట్ చేసుకున్నాడు.

OG: Emraan Hashmi plays villain againgst Pawan Kalyan - Cineblues.Com

అయితే.. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా అమితాబ్‌ను తీసుకోవాలని భావించాడట సుజిత్. అలాగే.. పవన్ తమ్ముడి క్యారెక్టర్ కోసం మళ‌యాళ‌ స్టార్ హీరో తోవినో థామస్ ను సెలెక్ట్ చేసుకున్నారు. కానీ.. ఇప్పుడు అదే రోల్ ను వెంకట్ నటిస్తున్నాడు. ఈ సినిమాలోని మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసం కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ని భావించగా.. ఆ పాత్ర కోసం ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ మెరవనున్నాడు. అలా.. మొదట అనుకున్న స్టార్ క్యాస్టింగ్‌ మొత్తాన్ని మార్చేశారట మేకర్స్. ఇక సాధర‌ణ‌ కాస్టింగ్ తోనే సినిమాకుఈ రేంజ్‌ హైప్ ఏర్పడిందంటే ముందు అనుకున్న క్యాస్టింగ్ తో సినిమా తీసి ఉంటే కచ్చితంగా బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యి ఉండేది.. ఓపెనింగ్స్‌ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆడియన్స్‌లో విపరీతమైన బజ్‌ నెలకొల్పిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకు వేచి చూడాల్సిందే.