బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వార్ 2 పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ ఎస్కైర్ ఇండియా తాజా ఎడిషన్ కవర్ పేజీ పై తారక్ ఫొటోస్ మెరిశాయి. ఇక ఈ మ్యాగజైన్ కి వచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. వార్ 2 కోసం భాషతో సంబంధం లేకుండా అందరం కలిసి పని చేస్తామని వివరించిన ఆయన.. నార్త్, సౌత్ టెక్నీషియన్స్ అంతా దీని కోసం పనిచేశారని.. ఇకపై బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అనే తేడాలు లేవు.. మనమంతా ఒక్కటే ఇండస్ట్రీ అంటూ తారక్ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.
భారతీయ సినీ ఇండస్ట్రీ గా గుర్తించాలని.. ఇలా పని చేస్తే సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయి. స్పెషల్ ఫార్ములాలు ఏమి ఉండవంటూ వివరించాడు. ఇదే విషయాన్ని గతంలో రాజమౌళి కూడా చెప్పుకొచ్చారని.. ఎంచుకున్న స్టోరీ ప్రేక్షకులకు నచ్చేలా చూపించడమే లక్ష్యం అంటూ వివరించాడు. ఇక వార్ 2 సినిమాను.. నేను అంగీకరించడానికి ప్రధాన కారణం బలమైన స్క్రిప్ట్, అద్భుతమైన కథతో రూపొందడమే. ఇక హృతిక్ రోషన్ తో కలిసి పని చేయడం మరింత ఆనందం ఇచ్చిందంటూ వివరించాడు.
అంతేకాదు.. ఇంటర్వ్యూలో పలు పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకున్న తారక్.. తాను ఓ నటుడు మాత్రమే కాదని.. గొప్ప ఛప్‌ని అంటూ వివరించాడు. నా భార్య ప్రణతి కోసం, నా ఫ్రెండ్స్ కోసం వంట చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పునుగులు బాగా వేస్తా. అలాగే.. నేను వండే బిర్యాని కూడా నాకు నచ్చుతుంది అంటూ ఎన్టీఆర్ వివరించాడు. ఇక.. ఇప్పటివరకు నేను లైఫ్ లో ఏది ప్లాన్ చేసుకోలేదని చెప్పుకొచ్చిన తారక్.. వచ్చిన అవకాశాలని నిజాయితీగా ఉపయోగించుకుంటున్నా అంతే అంటూ చెప్పుకొచ్చాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్‌లో భాగంగా రూపొందిన ఈ వార్ 2లో కీయారా అద్వానీ హీరోయిన్గా మెరిసింది. ఇక.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. హృతిక్, తారక్‌ల మధ్యన వచ్చిన వార్ సీన్స్.. ఫ్యాన్స్‌లో మరింత హైప్‌ను పెంచాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. తారక్‌కు ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసి పెడుతుందో చూడాలి.