టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా.. ఒకప్పుడు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌ను దక్కించుకుంది. దాదాపు దశాబ్దంన్నరపాటు టాలీవుడ్‌ను షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోలా అందరి సరసన నటించింది. అంతేకాదు.. సౌత్‌తో పాటే బాలీవుడ్ సినిమాలతో తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తుంది. సినిమాలు లేకపోయినా మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో మొదటి వరుసలో ఆమె ఉండటం విశేషం.
చివరగా ఖుషి సినిమాలో టాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. త్వరలోనే మరో బిగ్ ప్రాజెక్టులో భాగం కానుందని న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. సమంత, నాగచైతన్య డివార్స్ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఈ అమ్మడు తర్వాత పుష్ప 2తో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అదే ఊ అంటావా.. మామ ఊఊ.. అంటావా. ఈ సాంగ్ అప్పట్లో ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. తన సినీ కెరీర్‌లో 15 ఏళ్ల పాటు నటించినా రాని క్రేజ్.. ఈ ఒకే ఒక్క సాంగ్ తో తన సొంతమైంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత మరోసారి స్పెషల్ సాంగ్‌లో నటించనుందంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
సమంత ప్రస్తుతం సినిమాల విషయంలో గతంతో పోలిస్తే 90% స్పెస్ తగ్గించేసింది. బాలీవుడ్ లోనే అడపాదడపా సినిమాలు చేస్తూ.. పలు ఇంట్రెస్టింగ్ సిరీస్‌లలో మాత్రమే నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా ఓ టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ మూవీ మరేదో కాదు పెద్ది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో.. చరణ్ పక్కన స్పెషల్ సాంగ్ లో సమంత మెరవనుందని సమాచారం. ఇక టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సుక్కు తన ప్రతి మూవీలో స్పెషల్ సాంగ్ ఉండేలా చూసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శిష్యుడు బుచ్చిబాబు కూడా గురువు నే ఫాలో అవుతూ.. పెద్ది సినిమాకు స్పెషల్ సాంగ్ ఫిక్స్ చేశాడట. ఇక మూవీ స్టోరీకి అనుగుణంగా సమంతతో స్పెషల్ సాంగ్ పెట్టాలని టీం ప్లాన్ చేస్తున్నారట. అయితే.. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ లేకున్నా.. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.