కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. భారీ అంచనా నెలకొల్పిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ యాక్టర్ సౌబిన్ సాహిర్, సత్యరాజ్ లాంటి స్టార్ కాస్టింగ్ అంత కీలకపాత్రలో మెరవనున్నారు. టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్‌ను పలకరించనుంది.
అలా.. భారీ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్లో హైప్ మొదలైంది. అటు అడ్వాన్స్ బుకింగ్స్ లో సినిమా జోరు చూపిస్తోంది. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట వైరల్ గా మారుతుంది. సినిమా క్లైమాక్స్ లో ఆడియన్స్‌ను థ్రిల్ చేసే.. ఓ కంటెంట్ రాబోతుందని.. ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు లోకేష్ కనకరాజ్ మాస్టర్ ప్లాన్ వేశాడు అంటూ తెలుస్తుంది. ఇప్పటికే భారీ స్టార్ కాస్టింగ్ నటిస్తున్న ఈ సినిమాల్లో కమల్ హాసన్ ఎంట్రీ ని కూడా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశాడంటూ టాక్ ఇప్పటికే వైరల్ గా మారుతుంది.
కాగా ఇప్పుడు క్లైమాక్స్ లో రోలెక్స్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఇక గతంలో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ రోల్‌లో సూర్య నటించి అదిరిపోయే పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సేమ్ అదే సర్ప్రైజ్ కూలీలో కూడా ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. కానీ.. క్లైమాక్స్‌లో కనిపించే రోలెక్స్ సూర్య కాదట.. ఈసారి రోలెక్స్ గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మెరవనున్నాడట. కేవలం అమీర్ ఖాన్ స్క్రీన్ పై కనిపించేది ఐదు నిమిషాలే అయినా.. ఆ పాత్ర ఇంపాక్ట్ మాత్రం సాలిడ్ గా ఉండనుందని సమాచారం.