టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో 25 రోజుల్లో ఓజి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ లో హైప్ క్రియేట్ చేసింది. చివరిగా పవన్ నుంచి వచ్చిన హరిహర వీరమల్లు సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచినా.. ఓజీ సినిమాపై మాత్రం అంచనాలు కాస్త కూడా తగ్గలేదు. ఓజీ బజ్ ఈ రేంజ్‌లో పెరగడానికి కారణం రెండేళ్ల క్రితం సినిమా నుంచి రిలీజ్ అయిన పవర్ఫుల్ గ్లింప్స్. ఇప్పటికే.. ఈ సినిమాపై అదే హైప్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు సుజిత్. ఇక పవన్ రీమేక్ సినిమాలు పూర్తిగా పక్కన పెట్టి.. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే మంచి జోనర్‌లను ఎంచుకుంటూ సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఈ క్రమంలోనే ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం ఈ సినిమాలు చూసేందుకు ఆసక్తి చెప్తున్నారు. ఇక వీళ్ళందరూ ఎదురుచూపుకు తగ్గట్టుగానే తాజాగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమై.. సినిమా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది. కేవలం టాలీవుడే కాదు.. ఇప్పటివరకు పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమాకు లేనంత రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్ సినిమాకు జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే దాదాపుగా 82 వేల డాలర్ల గ్రాస్ మస్తుళ్లు దక్కాయి. తర్వాత రోజు రోజుకు బుకింగ్స్ అంతకంతకు పెరిగిపోతూ వస్తున్నాయి. రెండవ రోజు అయితే ఏకంగా లక్షా 84 వేల డాలర్ల గ్రాస్ అందింది.
ఇలా.. సినిమా ఓపెన్ బుకింగ్స్ ప్రారంభమైన రెండు రోజులకే 2లక్షల 67 వేల డాలర్ల గ్రాస్ వసుళ్లను కొల్లగొట్టి ఓజీ ప్రభంజనం సృష్టించింది. ఇక మూడో రోజు ఏకంగా 5 లక్షల డాలర్లను సొంతం చేసుకుంది. అంటే.. దాదాపు మూడు రోజుల్లో లక్ష 40 వేలకు పైచిలుకు గ్రాస్ ఓపెన్ బుకింగ్స్ తోనే సొంతమయ్యాయి. ఈ రేంజ్ లో ఇటీవల కాలంలో ఏ పాన్ ఇండియా సినిమాకు దక్కలేదు. ఇక నాలుగో రోజు సైతం ఇదే రేంజ్ లో కలెక్షన్లు బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే రేంజ్ లో సినిమా బుకింగ్స్ కొనసాగితే.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు వన్ మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కను టచ్ చేయడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఫాస్టెస్ట్ వన్ మిలియన్ డాలర్ గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన రికార్డ్ ఓజీకి దక్కుతుంది. ఆయన బర్త్డేకి ఫ్యాన్స్ దానిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు అవుతుంది అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. మరి సెప్టెంబర్ 2న సినిమా 1 మిలియన్ మార్క్‌ను టచ్ చేస్తుందా.. లేదా.. ఏ రేంజ్ లో రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.