ప్రజెంట్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లేనప్‌లో రెండు రెండు సినిమాలు మిగిలి ఉన్నాయి. ఒకటి ఓజి, మరొకటి ఉస్తాద్ భగత్ సింగ్ కాగా.. ఇప్పటికే సినిమా పూర్తి చేసుకుని సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ తుది దశకు చేరుకుంది. మరో వారంలో సినిమా కంప్లీట్ అవుతుందని అంటున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 రిజల్ట్స్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్‌పై ఆడియన్స్‌లో ఆశలు సన్నగిల్లినట్లు తెలుస్తుంది. ఒక పక్క ప్రొడ్యూసర్ ఏ.ఏం. రత్నం, డైరెక్ట్ జ్యోతి కృష్ణ పార్ట్ 2 కోసం ప్లాన్ చేసిన ఫ్యాన్స్ ఒప్పుకునేలా పరిస్థితి లేదు.
ఇలాంటి క్రమంలో పవన్ గతంలోనే కమిట్మెంట్ ఇచ్చిన మరో మూవీ సెట్స్‌పైకి వస్తుందా.. లేదా.. అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. నిర్మాత రామ్ తాళ్లూరి, సురేందర్ రెడ్డి కాంబోలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయనున్నట్లు అఫీషియల్ ప్రకటన ఇచ్చి ఏళ్లు గడిచిపోతున్నా.. ఇప్పటివరకు ఆ సినిమా పై ఎలాంటి అప్డేట్ అందలేదు. కానీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ ఈ సినిమాని కూడా లైన్‌లో పెట్టనున్నాడని కానీ.. సురేందర్ రెడ్డి ముందు చెప్పిన స్టోరీ కోసం ఎక్కువ డేట్స్, భారీ బడ్జెట్ అవసరం ఉన్న క్రమంలో ఆ సినిమాను పక్కన పెట్టేసి తమిళ్ రీమేక్ ను పవన్ సజెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
రాజకీయంగా బిజీగా ఉన్న క్రమంలో స్ట్రెయిట్ సినిమాలను ఎక్కువగా నటించలేనని.. వేగంగా పూర్తయ్య రీమిక్స్ సినిమాలపై దృష్టి పెట్టమని సురేందర్ రెడ్డికి చెప్పాడట పవన్. ఏజెంట్ తో దారుణమైన డిజాస్టర్ మూట కట్టుకున్న సురేందర్ రెడ్డికి ఇప్పుడు పవన్ మాటకు ఎస్ చెప్పడం తప్ప.. మరో మార్గమే లేదు. ఈ క్రమంలోనే పవన్తో సినిమా చేయడానికి వచ్చిన లైఫ్ టైం ఆపర్చునిటీని ఎలాగోలా సద్వినియోగం చేసుకోవాలని సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రస్తుతం ఈ వార్తల్లో క్లారిటీ లేకున్నా.. రామ్ తాళ్లూరుకి సినిమా ఐదారేళ్లుగా పవన్ కళ్యాణ్ పెండింగ్ పెడుతూ వస్తున్న క్రమంలో.. ఎలక్షన్స్‌కు కూడా మరో 4 ఏళ్ల సమయం ఉంది. దీంతో.. ఈ గ్యాప్‌లో ఒకటి లేదా రెండు సినిమాలు చేసే ఆలోచనల పవన్ ఉన్నాడని.. అది కూడా ఎవరైతే సినిమాను సరవేగంగా కంప్లీట్ చేస్తారో వారితోనే సినిమా చేయాలని కండిషన్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక సురేందర్ రెడ్డి తన స్టైల్ మార్చుకొని వేగంగా సినిమాని తెరకెక్కించే సక్సెస్ అందుకుంటాడా.. లేదా.. వేరొక దర్శకులతో పవన్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తాడా.. ఎలాంటి పరిస్థితులు ఎదురవన్నాయో వేచి చూడాలి.