సౌత్ స్టార్ బ్యూటీ నయనతార తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగా భాషతో సంబంధం లేకుండా.. సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు, అవమానాల తర్వాత ఈ రేంజ్‌కు చేరుకుంది. ఇక 50 ఏళ్ల వయస్సు మీద పడుతున్నా.. ఈ అమ్మడు వరుస సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది స్టార్ హీరోలకు జంటగా నటించి.. వాళ్ళను మించి పోయే రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుని.. తెలుగు, తమిళ్ కాదు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకునే దిశగా అమ్మడు అడుగులు వేస్తుంది.
ఇలాంటి క్రమంలోనే.. తాజాగా చిరు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో నయనతార తన సినీ కెరీర్‌లో ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశానంటూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. 2005లో డైరెక్టర్ మురుగదాస్, సూర్య కాంబలో వచ్చిన గజినీ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో అసిన్ హీరోయిన్‌గా మెరువగా.. నయనతార సెకండ్ హీరోయిన్ గా ఆకట్టుకుంది. ఈ మూవీలో కొంచెం బ్యాడ్ గా చూపించారని.. హీరోయిన్ పాత్రకు దగ్గరగా ఉందని చెప్పి అలా నెగిటివ్గా చూపించడం చాలా బాధించిందని వివరించింది నయనతార.
గజినీ సినిమా చేసి తప్పు చేశానని.. తను తీసుకున్న ఎన్నో నిర్ణయాల్లో బిగ్గెస్ట్ రాంగ్ డెసిషన్ ఇది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక నయన్.. తన సినిమాలు కంటే పర్సనల్ విషయాలతోనే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. మొదట స్టార్ హీరోలతో లవ్ ఎఫైర్లపై వైరల్ గా మారిన ఈ అమ్మడు.. తర్వాత డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించే వివాహం చేసుకుంది. గత కొద్ది రోజులుగా భర్తతో విడాకుల రూమర్లతో అమ్ముడు వైరల్ గా మారుతుంది. తాజాగా దానిపై అమ్మడు క్లారిటీ ఇచ్చేసింది నయనతార. అవన్నీ ఫేక్ అంటూ కొట్టి పడేసింది. ప్రస్తుతం తన భర్త విగ్నేష్, ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ సత్త చాటుకుంటుంది. ముందు ముందు ఎలాంటి సక్సెస్‌లు అందుకుంటుందో.. ఏ రేంజ్ లో పాపులారిటీ పెంచుకుంటుందో చూడాలి.