టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆక్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ఆయన నుంచి వచ్చిన సోలో మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే.. సినిమా రిలీజ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. సినిమాల్లో కంటెంట్ వీక్ గా ఉందని.. కేవలం ఎన్టీఆర్ నటన, డ్యాన్స్, తారక్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కారణంగానే సినిమా సూపర్ హిట్ అయిందని పార్ట్ 2 కు అవసరమయ్యే కంటెంట్ ఏమీ దేవరలో చూపించలేదని.. ఒకవేళ సెకండ్ పార్ట్ వచ్చినా.. రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్‌ను ఆట్టుకోలేదంటూ విశ్లేషకులు నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇలాంటి క్రమంలో.. గత రెండు రోజుల నుంచి సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. వార్ 2 బాక్సాఫీస్ దగ్గర వర్క్ అవుట్ కాకపోవడంతో.. దేవర 2 కూడా పెద్దగా వర్కౌట్ కాదని చర్చ హట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను ఆపేస్తే బెటర్ అని ఎన్టీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నాడంటూ.. కొరటాలకు దాన్ని చెప్పడం.. వెంటనే కొరటాలు కూడా ఓకే చెప్పి దేవర స్క్రిప్ట్‌ను పక్కన పెట్టేసాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే కొరటాల.. నాగచైతన్యతో కొత్త సినిమాకు కూడా ప్లానింగ్స్ మొదలు పెట్టేసాడు అని చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ టాక్ తెగ వైరల్‌గా మారుతుంది. గత రెండు రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా మారడంతో.. తాజాగా మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకున్నట్టు అసలు ఆగిపోలేదని.. స్క్రిప్ట్ వర్క్, డైలాగ్ వర్షన్ తో సహా అన్ని పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది అంటూ వివరించారు. అయితే.. ఈ సీక్వెల్ కి ప్రజెంట్ అయితే ఎలాంటి హైన్ నెలకొనే అవకాశం లేదు. తారక్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూసిన సాధారణ ఆడియన్స్‌లో అయితే బజ్ క్రియేట్ అవ్వడం కష్టమే.