అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఏ రేంజ్ లో మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్పా ది రైజ్ సినిమా తర్వాత ఆయన నేషనల్ లెవెల్ లో ఇమేజ్ దక్కించుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసి స్టార్ హోదాతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వరుస వివాదాలతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ తెగ ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు బన్నీ. అయినా ఫ్యాన్స్ మాత్రం బన్నీని ఆకాశానికి ఎత్తేస్తూ తెగ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు.
మొదట్లో మెగా కుటుంబంతో అల్లు అర్జున్ వివాదం వార్తలు వైరల్‌గా మారాయి. అయితే.. తర్వాత పుష్ప 2 రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ ఘటన ఆయనకు మరొక షాక్ ఇచ్చింది. ఈ ఘటనతో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఒక రాత్రంతా కస్టడిలోనే ఉండి వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ఇమేజ్ బాగా డామేజ్ అయిందని టాక్ తెగ వైరల్ గా మారింది. అయితే.. తర్వాత బన్నీ దాని నుంచి తేరుకొని అట్లీ డైరెక్షన్‌లో నెక్స్ట్ సినిమాకు ఓకే చేశాడు. ఇది భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా రూపొందుతుంది. అయితే.. నిజానికి ఈ ప్రాజెక్టు కంటే ముందు బన్నీ – త్రివిక్రమ్ శ్రీనివాస సినిమా చేయాల్సి ఉండగా.. దానిని వదిలేసి అట్లీ డైరెక్షన్లో సినిమాకు ఆయన మగ్గు చూపాడు. కాగా త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లాంటి మూడు వరుస బ్లాక్ బస్టర్లు వచ్చాయి.
ఈ క్రమంలోనె మరోసారి వీళ్ళిద్దరి కాంబో రిపీట్ అవ్వాలని ఎంతో మంది ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రాజెక్టు సడన్గా ఆగిపోవడంతో అంతా షాక్ అయ్యారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టులో అల్లుఅర్జున్ కు బదుల ఎన్టీఆర్ నటించబోతున్నాడు అంటూ క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక బన్నీ నటించాల్సిన ప్రాజెక్ట్ ఎన్టిఆర్‌కు వెళ్ళిపోయింది. కాగా.. ఈ ప్రాజెక్టు విషయంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్యన విభేదాలు మొదలయ్యాయని.. వాళ్ళిద్దరూ ప్రస్తుతం అసలు మాట్లాడుకోవడం లేదంటూ లేటెస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న. అసలు మ్యాటర్ ఏంటంటే త్రివిక్రమ్ తన ఫోన్ లో అల్లు అర్జున్ నెంబర్‌ను సైతం బ్లాక్ చేసేసాడట. త్రివిక్రమ్ క్లోజ్ ఫ్రెండ్ అయ్యిన పవన్ సన్నిహిత వర్గాల నుంచి ఈ టాక్ వైరల్ గా మారుతుంది.