టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మ్యాన్ ఆఫ్ మాసేస్‌గా రాణిస్తున్నాడు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక తాజాగా వార్ 2తో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన తారక్ ఈ సినిమా రిలీజ్‌తో మిక్స్డ్ ట్రాక్ దక్కించుకున్నాడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో హృతిక్ మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో కొనసాగుతున్న క్రమంలో.. తారక్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఎన్టీఆర్ బాల్యం నుంచి చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
చిన్న వయసులోనే బాల రామాయణం సినిమాతో రాముడి పాత్రలో ఆకట్టుకున్న తారక్.. ఎంతోమంది ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ పిల్లాడు గొప్పవాడు అవుతాడు అంటూ ఎంతో మంది ప్రముఖులు చెప్పిన మాటను నిజం చేశాడు. నేడు పాన్ ఇండియా లెవెల్లో ఆయన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టకముందే ఓ సీరియల్లో మెరసాడు. చాలామందికి ఈ విషయం తెలియదు. కాగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్టీఆర్ నటించిన సీరియల్ మరేదో కాదు భక్త మార్కండేయ. ఈటీవీలో టెలికాస్ట్ అయినా ఈ సీరియల్ లో.. ఎన్టీఆర్ మార్కండేయ పాత్రలో మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయన చేసిన నటన అప్పట్లో ఎంతో మందిని ఆకట్టుకుంది. కాగా సీరియల్ ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేదు.
కానీ.. ఎన్టీఆర్ నటనకు మాత్రం ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఈ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇక వార్ 2 సినిమా.. ఊహించిన రిజల్ట్ అందుకోకపోయినా ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. తన నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో రాణిస్తున్నాడు. ఈ సినిమాతో.. యాక్షన్, ఎమోషన్స్ అన్నిటిని కలిపి ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో దేవర సీక్వెల్ ప్రారంభం కానుంది. ఇలా మొత్తం మీద చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన తారక్ జర్నీ.. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ మరిన్ని సక్సెస్‌లు అందుకుని ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడు.. ఏ రేంజ్ లో అభిమానాన్ని దక్కించుకుంటాడు చూడాలి.