టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ ను ప్రారంభించి తర్వాత హీరోగా మారాడు. ఈ క్రమంలోనే తను నటించిన ఎన్నో సినిమాలు.. ఇంటర్వ్యూలో సందడి చేసిన నాని.. పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎలాంటి ఇంటర్వ్యూలోను పాల్గొనలేదు. మొట్టమొదటిసారి ఆయన కెరీర్లో పర్సనల్ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. అదే జీ తెలుగులో రీసెంట్గా ప్రారంభమైన జయంబు నిశ్చయంబురా. ఈటాక్ షోకు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రోగ్రాంలో.. నాని షేర్ చేసుకున్న ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.
అసలు మేటర్ ఏంటంటే.. షోలో జగపతిబాబు నాని ని.. సినిమాల్లోకి వెళ్తున్నానని మీ ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటూ ప్రశ్నించాడు. దానికి నాని రియాక్ట్ అవుతూ.. వాళ్ళు పెద్ద సర్ప్రైజ్ ఏమి ఫీల్ కాలేదు. చదువు ఎలాగో అబ్బలేదు కదా.. నేను ఈ దారిని ఎంచుకున్నానని వాళ్లకు ముందే తెలుసు. కానీ.. నన్ను చిన్నప్పటి నుంచి మా పిన్ని చాలా ఎంకరేజ్ చేసేది. మా ఇంట్లో ఎవరు చూడని టాలెంట్ నాలో చూసింది. ఇప్పుడు నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత సక్సెస్ అవ్వడం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. నేను చెప్పా కదా ఏదో ఒక రోజు నువ్వు ఈ స్థాయికి వస్తావని ఒకసారి గుర్తు తెచ్చుకో అంటూ ఉంటుందని వివరించాడు.
నాకే పిన్ని ఇంతలా నన్ను నమ్మిందా అన్ని ఆశ్చర్యమేస్తుందని వివరించిన నాని.. తన పిన్ని సొంత అమ్మతో సమానమని.. చిన్నప్పటి నుంచి తన దగ్గర ఎక్కువగా పెరగానంటూ వివరించాడు. ఇక నా గత సినిమా హిట్ 3లో మా అమ్మను చూడొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్ నాకు సర్ప్రైజ్ ఇస్తూ.. చనిపోయిన మా అమ్మ ఏఐ ద్వారా మాట్లాడినట్లు చూపిస్తుంది గుర్తుందా.. అందులో కనిపించింది మా పిన్ని అంటూ వివరించాడు. దీంతో నాని తల్లి కూడా.. ఓనటి అని.. హిట్ 3లో నటించింది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది.