ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏ స్టార్ హీరో అయినా.. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా.. పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుకోవాలని కష్టపడుతున్నారు. కంటెంట్ ఏదైనా.. స్టోరీ ఎలాంటిదైనా.. ఫైనల్ గా వాళ్ళ లక్ష్యం మాత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకొని రికార్డులు క్రియేట్ చేయడం. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోస్ అంతా తమ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాగా.. ఇప్పటివరకు సౌత్ నుంచి ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ కానీ.. హీరోస్ కానీ భారీ రేంజ్ లో సినిమా చేసే సాహసం చేయలేదు. కారణం సగటు ఆడియన్స్ సైతం తమిళ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం. ఇప్పటివరకు తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ పాన్ ఇండియన్ సినిమా కూడా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
తెలుగు సినీ ఇండస్ట్రీని బీట్ చేసే కెపాసిటీ తమిళ్ ఇండస్ట్రీకి లేనే లేదంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో.. కూలి సినిమా మరో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కు సిద్ధమయింది. ఇక సినిమా ఫస్ట్ రివ్యూ ని బట్టి రజనీకాంత్ మూవీలో హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టనున్నాడని సమాచారం. అంతేకాదు.. కింగ్ నాగార్జున విలన్ అయినా సినిమాకి స్ట్రాంగ్ బ్యాక్ బోన్ గా నిలిచాడట. అలాగే అమీర్ ఖాన్ పాత్ర నడివి కొద్దిసేపు అయినా.. సినిమా పై ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ఇక.. ఉపేంద్ర, సత్యరాజ్ ఇద్దరు నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటించినా.. వీళ్ళిద్దరిని లోకేష్ ఫుల్ ప్లెడ్జ్‌డ్‌గా వాడుకుని.. పెను ప్రభంజనానికి ప్లాన్ చేశాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాదు.. గతంలో ఎన్నడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ రేంజ్ లో అదిరిపోయే కంటెంట్ రాలేదని.. ఈ సినిమాతో లోకేష్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ బ్లాస్ట్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు క్రిటిక్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. ఏదేమైనా లోకేష్ చేస్తున్న ఈ సినిమా తన యూనివర్స్ లో భాగం కాదని.. ఇదొక వైవిధ్యమైన స్టోరీ అంటూ స్పష్టంగా వివరిస్తున్నారు. సినిమాలో రజనీకాంత్ వింటేజ్ లుక్ ని చూపించడమే కాదు.. హై ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ మెప్పించేలా డిజైన్ చేశారట. ఇక సెకండ్ హాఫ్ లో రజిని నట విశ్వరూపం చూడనున్నారని.. భారీ యాక్షన్ ఎలువెన్స్ తో సినిమాను డిజైన్ చేశారంటూ తలుస్తుంది. అలా.. ఫైనల్ గా రజినీకాంత్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ గా నిలుపుతారు అంటూ కోలీవుడ్ క్రెడిటిక్స్ అభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం. మరి సినిమా రిలీజ్ అయిన తరువాత ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో.. లాంగ్ రన్ లో వేయికోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేస్తుందో.. లేదో.. చూడాలి.