రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ లైనప్‌లో మూవీస్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వెంగ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే సందీప్ తన స్టోరీతో పాటు.. క్యాస్టింగ్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. దీంతో.. సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో.. ప్రభాస్ పోలీసు రోల్‌లో మెరవనున్న సంగతి తెలిసిందే. కాగా.. మరో కీలకమైన పవర్ఫుల్ రోల్ కోసం మెగాస్టార్ చిరంజీవిని.. సందీప్ రంగంలోకి దించుతున్నాడని టాక్ నడుస్తుంది.
సందీప్ వంగా చివరగా తెరకెక్కించిన యనిమల్‌లో రణ్‌బీర్ కపూర్‌కు తండ్రిగా అనిల్ కపూర్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా.. ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం చిరు ఓ పవర్ఫుల్ పాత్రలో మెరవనున్నాడట. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు తండ్రి రోల్‌లో చిరంజీవి కనిపించనున్నాడని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. యాంగ్రీ ఫాదర్ రోల్లో చిరంజీవి కనిపించనున్నట్లు సమాచారం. అయితే.. మొదట ఈ సినిమాల్లో ఆ పాత్ర కోసం విజయ్ సేతుపతి, సంజయ్ దత్‌లను సందీప్ భావించాడట.
కానీ.. మెగాస్టార్ అయితేనే ఈ పాత్రకు తగిన న్యాయం జరుగుతుందని.. మూవీ యూనిట్ చెప్పేయడంతో చిరంజీవికి స్టోరీ చెప్పి.. ఆ పాత్ర కోసం ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే చిరంజీవి 4 సినిమాల కమిట్మెంట్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. ఇలాంటి క్రమంలో సందీప్ రెడ్డి వంగా సినిమాలో కీ రోల్‌కు ఆయన ఒకే చెప్తాడా.. లేదా.. అనేది వేచి చూడాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం.. భీమవరం బుల్లోడు ఇద్దరి పర్ఫామెన్స్‌తో థియేటర్లు బ్లాస్ట్ అవడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు చెప్తున్నారు.