టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా సైతం ఒకటి. పవన్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం.. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక మరో నెల రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించినందుని.. గతంలోను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ సైతం.. నాన్ స్టాప్‌గా సినిమా అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు ఘోరమైన రిజల్ట్ నుంచి.. ఓజి ట్రీట్ తో ఫ్యాన్స్ తేరుకునేలా చేస్తుందంటూ అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. మూవీ టీం కూడా.. ప్రమోషన్స్‌లో ఫైర్ స్ట్రామ్ సాంగ్ తో గ్రాండ్గా ప్రారంభించారు. ఈ సాంగ్ ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంది. ఇప్పటికి యూట్యూబ్లో టాప్ రన్నింగ్ లో ఈ సాంగ్ కొనసాగుతూనే ఉంది.
అయితే.. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే కమ్మని అంటూ మరో సాంగ్ ప్రోమోను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. అప్పటినుంచి ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా బయటకు రాకపోవడం.. ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ పరుస్తుంది. ఇక నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా డీవీవీ బ్యానర్ ఆయనకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. అయితే.. ఈ పోస్ట్ కింద పవన్ అభిమానులు ఓజి సినిమాపై మరో అప్డేట్ ఇవ్వాలంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో.. వారి కామెంట్ల పై రియాక్ట్ అయిన మూవీ టీం.. మరో రెండు రోజుల్లో సాంగ్ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుందని.. వచ్చే వారంలో సాంగ్ రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. అంటే.. నెక్స్ట్ వీక్ 27న వినాయక చవితి పండుగ ఉంది. ఆ స్పెషల్ డేను సెలబ్రేట్ చేసుకుంటూ సినిమాకు సంబంధించిన సాంగ్ రిలీజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇక్కడవరకు అంతా బానే ఉన్నా.. సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ప్రస్తుతం ఫ్యాన్స్‌లో టెన్షన్కు కారణమవుతుంది. అదేంటంటే.. సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని.. నాలుగు రోజుల వరకు షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉండనే ఉంది అంటూ తెలుస్తుంది. అది కూడా పవన్ షూట్ అని టాక్. ఇక డిప్యూటీ సీఎం గా బాధ్యతలతో పవన్ ఫుల్ బిజీ అయిపోయాడు. దీంతో.. ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. వచ్చేవారం.. పవన్ డేట్స్ ఇస్తే షూటింగ్ అక్కడితో పూర్తిచేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇంతకీ పవన్ సినిమాకు కావాల్సిన నాలుగు రోజుల డేట్స్ను కేటాయిస్తాడా.. లేదా.. అనేది ఇప్పుడు అందరిలోనూ పెద్ద సందేహంగా మారింది. ఒకవేళ కాస్త అటు ఇటు అయినా పవన్ డేట్స్ కుదరకపోతే సినిమా వచ్చే నెల 25న రిలీజ్ కావడం చాలా కష్టమైపోతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ ను మేకర్ అందిస్తారో.. రిలీజ్ డేట్ పై వస్తున్న న్యూస్ కు క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.