టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో తెలిసిందే. దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ నటించిన సినిమాల నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా వస్తే బాగుండు అంటూ అభిమానులు సైతం అదే రెంజ్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే త్వరలో రెబల్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ టాక్ తెగ ట్రెండింగ్ గా మారింది. ప్రభాస్ తన కెరీర్లో డిఫరెంట్ కాన్సెప్ట్ నటిస్తున్న మూవీ ఫౌజి. హను రాఘవపూడి డైరెక్షన్లో ఇమన్వీ హిరోయిన్‌గా.. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుంది.
ఈ సినిమాకు మెయిన్ హైలెట్ సాంగ్స్ అంటూ ఇప్పటికే టాక్ వైరల్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటున్న మేకర్స్.. 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేసారట. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు రాలేదు సరికదా.. రిలీజ్ డేట్ పై కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. అసలు సినిమా షూటింగ్ అవుతుందా.. లేదా.. మూవీ ఆగిపోయిందా అనే సందేహాలు కూడా అభిమానులలో మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఫౌజి సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఏప్రిల్ నెలలో వచ్చే లాంగ్ వీకెండ్.. అది కూడా గుడ్ ఫ్రైడే కలిసి రావడంతో మేకర్స్ ఏప్రిల్ నెలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. అంతేకాదు.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో.. ప్రభాస్ పిరియడికల్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభించకముందే.. తన ప్రాజెక్టులన్ని కంప్లీట్ చేసి కాస్త స్పేస్ ఇవ్వాలని సందీప్ రెడ్డివంగా ప్రభాస్‌కు కండిషన్ పెట్టారట. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫౌజి సినిమా.. గుడ్ ఫ్రైడే స్పెషల్‌గా రిలీజ్ చేయనున్నారంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్‌ను దక్కించుకుంటుందో చూడాలి.