డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఖాతాలో ఇన్ని ఫ్లాపులా.. తెలిసే వీరమల్లు ను ముంచేశారా..!

టాలీవుడ్‌ డైరెక్టర్‌గా జ్యోతి కృష్ణ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనికి కారణం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడితో పాటు.. జ్యోతి కృష్ణ కూడా దర్శకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే.. గతంలో జ్యోతి కృష్ణ దర్శకుడిగా ఎన్నో సినిమాలకు పనిచేసిన ఊహించిన రేంజ్‌లో ఆ సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోయాడు. కాగా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే సక్సెస్ రేట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటిది.. జ్యోతి కృష్ణ గతంలో డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాలు వైర‌ల్‌గా నిలిచాయి. కానీ.. జ్యోతి కృష్ణ నిర్మాత ఏ.ఎం.రత్నం కొడుకు అన్న సంగతి తెలిసిందే.

ఇక జ్యోతి కృష్ణ గతంలోనే ఎన్నో సినిమాలను తెరకెక్కించి.. బాక్సాఫీస్ దగ్గర ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. నీ మనసు నాకు తెలుసు సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకుడుగా వ్యవహరించాడు. తరుణ్‌, త్రిష, శ్రీయ ప్రధాన పాత్రలో నటించడం ఈ సినిమా సాంగ్స్ ఆక‌ట్టుకున్న‌ కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర అయితే డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా తర్వాత 2006లో రిలీజ్ అయిన కేడి సినిమాకు సైతం జ్యోతి కృష్ణని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాల్లో జ్యోతి కృష్ణ సోదరుడు రవి కృష్ణ హీరోగా మెరిసాడు. ఈ సినిమా ప్రేక్షకుడికి నిరాశ మిగిల్చింది. తర్వాత జ్యోతి కృష్ణ.. హు లలల పేరుతో తమిళ్ సినిమాను రూపొందించుగా.. 2012లో రిలీజ్ అయిన సినిమా ఆడియన్స్‌కు రీచ్ కాలేదు.

Hari Hara Veera Mallu director Jothi Krishna, wife Aishwarya enter  parenthood

ఇక తర్వాత గోపీచంద్ హీరోగా ఆక్సిజన్ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే నిలిచింది. తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్టన్‌లో రూల్స్ రంజాన్ సినిమా వచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా.. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఇలాంటి ఫ్లాప్ డైరెక్టర్‌ను నమ్మి.. పవన్ కళ్యాణ్ అసలు అవకాశం ఎందుకు ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రాక్ రికార్డు చూసి జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని.. పార్ట్ 2 కోసమైనా జ్యోతి క్రిష్ణను డైరెక్షన్ కు దూరంగా పెడితే మంచిదంటూ నెటిజ‌న్లు అభిప్రాయాల్లో వ్యక్తం చేస్తున్నారు. తెలిసి తెలుసే ఇలాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో వీరమల్లు తీసి ముంచేసారంటూ.. మండిప‌డుతున్నారు.