బాలయ్యకు హీరోయిన్ గా, తల్లిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్‌లో నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఎలాంటి క్రేజ్‌.. పాపులాంటితో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా నాలుగు హిట్లు అందుకుని ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా అఖండ 2 లో నటిస్తున్నాడు బాల‌య్య‌. ఈ క్రమంలో సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఇక కెరీర్ ప్రారంభంలో సాఫ్ట్ సినిమాలో నటించిన బాలయ్య.. మెల్లమెల్లగా మాస్‌ సినిమాలకు క్యారెట్ అడ్రస్ గా మారిపోయాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక రానున్న అఖండ 2తో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అద్దుకోవడం పక్కా అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Mangamma Gari Manavadu Mp3 Songs Free Download 1984 Telugu Movie

ఇలాంటి క్రమంలో బాలయ్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. అదేంటంటే గతంలో బాలయ్య స‌ర‌స‌న హీరోయిన్గా నటించి.. ఆయనతో రొమాన్స్ చేసిన ఒక స్టార్ బ్యూటీ తర్వాత బాలయ్యకు తల్లిపాత్రలో నటించిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆ సినిమాల ఏవో ఒకసారి తెలుసుకుందాం. ఆమె మరెవరో కాదు సుహాసిని. కెరీర్ స్టార్టింగ్‌లో మంగమ్మగారి మనవడు సినిమాలో బాలయ్య స‌ర‌స‌న నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది.

వీళ్ళ కాంబినేషన్‌కు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెర‌కెక్కిన లెజెండ్ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా సుహాసిని మెరిసింది. ఏదైమైనా వీళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషన్ గా ఆన్ స్క్రీన్‌పై సక్సెస్ఫుల్ కాంబో గా మంచి ఇమేజ్ దక్కింది. అయితే.. తల్లిగా నటించడం మాత్రం కొంతమంది ఆడియన్స్ అసలు జీర్ణించుకోలేకపోయారు. తల్లి, కొడుకులుగా సుహాసిని.. బాలయ్య మధ్య ఉండే సీన్స్ లేకపోయినా.. బాలయ్య చిన్నతనంలో అయ‌న తల్లి పాత్ర‌లో సుహాసిని క‌నిపించింది. బాల్యంలోనే ఆమె చనిపోతుంది. కనుక ఇద్దరి మధ్య తల్లి కొడుకులు అనిపించే అంత ఎమోషన్ సీన్స్ లేకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే మాత్రం సినిమా కాస్త ఫ్లాప్ అయ్యేది. చాలావరకు మేక‌ర్స్‌ ఇబ్బందులు పడాల్సిన వచ్చేది అనడంలో అతిశ‌యోక్తి లేదు.