వీరమల్లు రిలీజ్ అడ్డుకుంటాం.. హైకోర్టులో అపీల్.. మేకర్స్ కు కొత్త టెన్షన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందె. ఇలాంటి క్రమంలోనే మేకర్స్‌కు సరికొత్త టెన్షన్ మొదలైంది. ఈ సినిమా కష్టాలు ఇప్పటిలో తీరేలా కనిపించడం లేదు. రెండు నెలలుగా అడ్డంకులు, అవరోధాలు ఎదుర్కొంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా గత నెల జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా విజువల్స్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇక ఇటీవల ఆ సమస్యలన్నింటినీ పూర్తి చేసుకుని కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. అలా ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించిన ఈ మూవీ జులై 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు మరోసారి కొత్త అడ్డంకి ఏర్పడింది. సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకుంటామంటూ పలువురు కోర్ట్‌మెట్లు ఎక్నేందుకు సిద్ధమయ్యారు.

మరో 20 రోజుల్లో రిలీజ్ కానున్న వీరమల్లు సినిమా రాబిన్ హుడ్ పేరుగాంచిన తెలంగాణ మహబూబ్నగర్ పండగల సాయన్న జీవిత కథ ఆధారంగా తీసార‌ని.. కానీ మేకర్స్ మాత్రం సినిమా కల్పితం అంటూ.. ఓసారి విజయనగరం, హరిహర బుక్క రాయలు స్టోరీ అంటూ.. రకరకాలుగా చెబుతూ అంద‌ర్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద నటుడు ఇలాంటి సంబంధం లేని కథలో ఎలా నటిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇటీవల రిలీజ్‌ చేసిన ట్రైలర్‌లో చార్మినార్ ప్రాంతం, ఔరంగాజేబుల గురించి చూపించారని.. బుక్క రాయలుకు, సాయన్న‌కు, ఔరంగజేబుల మధ్య సుమారు 60 ఏళ్లు తేడా ఉందని చెప్పుకొచ్చారు. ట్రైలర్ చూస్తే పవన్ పాత్ర పండగల సాయన్న కథను పోలే ఉంటుందని.. అలాంటిది ఆయన కథను ఆయనకు సంబంధం లేదని.. టైంతో ముడిపెట్టి తీయడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు డబ్బు కోసం కమర్షియల్ సినిమా తీస్తూ.. సాయన్న కథను చరిత్రకు సంబంధం లేకుండా నిజాములు, మొగలిల సమయంలో ఉన్నట్లుగా చూపించడం ఏంటని.. అదే చరిత్రగా చూపించే ప్రయత్నం జరుగుతుందని.. దీనిని తప్పకుండా మేము అడ్డుకొని తిరుతం.. దీనికోసం కోర్టుకైనా వెళ్తామంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే పవన్ గారిని కూడా కలుస్తామని.. ఆయన మాకు శత్రువు కాదు.. మాకు ఉన్న గొడవ కేవలం సినిమా క‌థ‌తోనే అంటూ క్లారిటీ ఇచ్చారు. మరి ఈ ఇష్యూ ముందు ముందు ఎంతవరకు దారితీస్తుందో.. ఎలాంటి పరిణామాలు ను చోటు చేసుకుంటాయో చూడాలి.