” హరిహర వీరమల్లు “తో ఆ బాధను చూపించాలనుకున్నాం.. పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి తాజాగా వ‌చ్చిన మూవీ హరిహర వీర‌మల్లుకు సక్సెస్ మీట్ నిన్న గ్రాండ్‌గా మేక‌ర్స్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సైతం పాల్గొని సందడి చేశాడు. సినిమా గురించి మాట్లాడుతూ.. కొంతమంది సక్సెస్‌లు, రికార్డుల‌ దగ్గర ఆగిపోతారని.. వాటన్నింటికంటే సినిమాతో ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అయ్యారు.. వాళ్లకు ఏం అందించాం.. వాళ్ళు థియేటర్ల నుంచి తమతో ఏం తీసుకెళ్లారు అనేది ముఖ్యమని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. మొగల్ చక్రవర్తి, ఔరంగా చెప్పు చారిత్రక తప్పులు చేశారని.. ఆ బాధ ప్రతి హిందువు డిఎన్ఏ లోకి వెళ్లిందని.. ఆ బాధను ప్రేక్షకులకు సినిమాతో చూపించడం ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎపి డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత.. పవన్‌ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్‌.. నిన్న రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్గా చేశారు.

ఇందులో.. ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నాకు గ్రామ పంచాయతీల గురించి చాలా వరకు తెలుసు. కానీ.. సినిమా పంచాయతీలు కూడా చేసి రిలీజ్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడు భావించలేదు. నా లైఫ్ లో ఎప్పుడూ ఏది ఈజీగా దొరకలేదు.. సినీ కెరీర్‌లో ఎప్పుడు మాట్లాడనంతగా వీరమల్లు కోసం మాట్లాడా. నా సినిమా కోసం బాధ్యతగా తీసుకున్న. అది నాకు ఆనందాన్ని కలిగించింది. ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాని చేయగలమని నిరూపించిన నిర్మాతకు అండగా నిలబడటం బాధ్యత అనిపించిందని.. డబ్బు వస్తుందా.. పోతుందా.. కాదు మనుషుల మమతల్ని కోల్పోతే తిరిగి పొందలేము అనే విషయం నాకు తెలుసు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. సినిమా రిలీజ్ కు సహకారం అందించిన ప్రొడ్యూసర్ నవీన్ యార్నేని, వై.ర‌వి శంకర్, టీజీ. విశ్వప్రసాద్‌ల‌కు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు పవన్. ఎప్పుడు సక్సెస్‌లు, రికార్డ్‌లని త‌ల‌కెక్కించుకోలేదని.. ఈ మూవీ ఏ లెవెల్ సక్సెస్ కూడా నాకు తెలియదు. విజువల్ ఎఫెక్ట్స్ కంటే కూడా సినిమాతో ఎమోషనల్‌గా ఆడియ‌న్స్‌ను ఎంత ప్రభావితం చేశాం అన్నది ముఖ్యం.

చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపై చిన్న చూపు చూశారేమో.. మొగల్ చక్రవర్తుల గొప్పతనం గురించి వాళ్లు రాశారు కానీ.. ఔరంగాజేబు జిజియా పన్ను గురించి ఎక్కడ చూపించలేదు అంటూ పవన్ వివరించాడు. ఈ విషయాన్ని టచ్ చేయడానికి వాళ్లంతా భయపడి ఉంటారు. ఔరంగాజేబు పాలన వెనుక ఒక చీకటి కోణం గురించి చూపించాలని.. ఆ కాలంలో ప్రజలు పడిన బాధ గురించి తెలియాలనే ఈ సినిమాను చేసాం. కోహినూర్ వజ్రం కంటే మన వేద సంపద గురించే ఈ సినిమాలో ఎక్కువగా చెప్పామంటూ వివరించాడు. కోహినూర్ పగిలిపోవచ్చు కానీ.. విజ్ఞానం ఎప్పటికీ ముక్కలు కాదు.. వేదాల్ని కోహినూర్‌లాగా భద్రపరచలేదు. ఆ సంపదని మనసులోనే పెట్టుకున్నాం. అదే మన దేశ సంస్కృతి గొప్పతనం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ అంశాలను చర్చించడంలో వీరమల్లు సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఫస్ట్ పార్ట్‌లో వచ్చిన టెక్నికల్ ఎర‌ర్‌లను సెకండ్ పార్ట్‌లో సరి చేసుకుంటాం. సెకండ్ పార్ట్ కూడా ఇప్పటికే 25% పూర్తయిపోయింది. అది కూడా త్వరగా చేయాలని కోరుకుంటున్నా అంటూ పవన్ కళ్యాణ్ వివరించాడు. ఇక ఈ సినిమా ఈవెంట్‌లో నిర్మాత ఏ.ఏం. రత్నంతో పాటు.. డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ థియేటర్‌లో అభిమానులు ప్రేక్షకులకు స్పందన సంతోషం కలిగించిందంటూ వివరించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రొడ్యూసర్ నవీన్, వై.రవిశంకర్ తదితరులు ఈ ఈవెంట్లో సందడి చేశారు.