వీరమల్లు ఎపిక్ డిజాస్టర్.. బుక్ మై షోలో దయనీయ పరిస్థితి..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీర‌మల్లు భారీ అంచనాల నడుమ గ్రాండ్గా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 23న‌ రాత్రి 9:30కే ఈ సినిమా ప్రీమియర్ షోస్‌ సైతం పడిపోయాయి. ఇక ప్రీమియర్ షో నుంచి సినిమాకు పాజిటీవ్‌ టాక్ వినిపించినా.. కొన్నిచోట్ల సినిమా డిజాస్టర్ అంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. సినిమా కంటెంట్ మాదిరిగా ఉన్నా.. విఎఫ్ఎక్స్ అసలు బాలేదని దారుణంగా ఉందంటూ కామెంట్లు వెలువ‌డ్డాయి. చాలా కాలం తర్వాత.. పవన్ సినిమాను వెండి తెరపై చూస్తున్నామని ఆనందంతో థియేటర్స్‌కు వచ్చిన అభిమానులకు చాలావరకు సినిమా షాక్ త‌గిలింది.

చిన్న సినిమాలో కూడా విఎఫ్ఎక్స్ క్వాలిటీ అదిరిపోయేలా స్క్రీన్ పైకి తీసుకువస్తుంటే.. రూ.250 కోట్ల బడ్జెట్ అంటూ సెల్ఫ్ డ‌బ్బాకొట్టిన‌ హ‌రిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ యావరేజ్ లెవెల్‌లో కూడా లేవంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్. ఈ క్రమంలోనే సినిమా నెగిటివ్ టాక్ ప్రభావం టికెట్ సేల్స్ పై కూడా భారీగా పడింది. బుక్ మై షో యాప్‌లో ఇప్పటివరకు సినిమా ఫస్ట్ రోజున గంటకు 20 వేల టికెట్లు కూడా అమ్ముడుపోని పరిస్థితి. ఉదయం 10 గంటల లోపే 18 వేల టికెట్లు సేల్స్ కాగా.. సికునిమా అదే రేంజ్‌లో టికెట్లు అమ్ముడుపోతే బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంతా భావించారు.

కానీ.. నెగటివ్ టాక్ కారణంగా.. మెల్లమెల్లగా సేల్స్ తగ్గుతూ వచ్చాయి. అలా గంటకు 9000 టికెట్లు కూడా అమ్ముడుపోని పరిస్థితి. రీసెంట్గా వచ్చిన కోలీవుడ్ హీరో ధనుష్ కుబేర మూవీ కంటే కూడా ఇది చాలా తక్కువ ఆక్యుఫెన్సీ. ఇంత దారుణంగా.. అది కూడా పవన్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఉండడం అందరికి షాక్‌ను కలిగిస్తుంది. దీని బట్టి సినిమాకు ఏ రేంజ్‌లో నెగెటివిటీ స్ప్రెడ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి దారుణమైన రిజల్ట్ వచ్చినప్పటికీ హరిహర వీరమల్లు టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసుకుని.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సక్సెస్‌మీట్‌కు పవన్ హాజరై సెన్సేషనల్ కామెంట్స్ చేయడం విశేషం.