తెలంగాణ టికెట్ బుకింగ్ లో వీరమల్లు విశ్వరూపం.. మూడు గంటల్లో ఎన్ని టికెట్స్ అంటే..?

పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా మెర‌వ‌నున్న లేటెస్ట్ మూవీ హ‌రిహార వీరమల్లు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా, కృష్, జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో సంయుక్తంగా రూపొందిన ఈ సినిమాకు ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మొట్టమొదటి పాన్‌ ఇండియన్‌ సినిమా కావడంతో ఆడియన్స్‌లో ఇప్పటికి హైప్ నెలకొంది. ప‌వ‌న్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో.. సినిమా ప్రీమియర్ షోస్‌కు భారీ ధర చెల్లించైనా వీక్షించేందుకు ఆరాటపడుతున్నారు. రేపు సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

Hari Hara Veera Mallu Nizam Bookings Open Now

ఈ క్రమంలోనే ఈరోజు రాత్రి 9:00 నుంచి 10 ప్రాంతాల్లో ప్రీమియ‌ర్స్‌ ప్రదర్శించనున్నాయి. దాదాపు 5 భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ కాయమంటూ ఇప్పటికే అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క హేటర్స్ సినిమాను ట్రోల్ చేస్తున్న ఆ ప్రభావం సినిమా పై ఖచ్చితంగా కనిపించడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక అసలు మేటర్ ఏంటంటే.. తాజాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమై అన్ని చోట్ల జోరు చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో సైతం ప్రీమియర్ షోస్‌ టికెట్స్ పెంపుకు అనుమతినిచ్చింది గవర్నమెంట్.

Hari Hara Veera Mallu : Part 1 - Sword vs Spirit (2025) — The Movie  Database (TMDB)

దీంతో నిన్న‌ ఉదయం నుంచి సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. డిస్ట్రిక్ట్ యాప్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన గంటల్లోనే వేలల్లో టికెట్లు అమ్ముడుపోయాయి. అలా మొదటి రోజు 2 గంటలో 22 వేల‌ టికెట్లు అమ్ముడు పోగా.. మూడు గంటల్లో 42 వేల టికెట్లు కొనుగోలు చేశారు. డిస్ట్రిక్ట్ యాప్ మొదలుపెట్టిన తర్వాత ఈ రేంజ్ బుకింగ్స్ జరగడం మొదటి సారి అంటూ అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు అంచనాలు లేని.. ఈ సినిమాకు ఈ రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్ జరగడం అంటే పవన్ మానియా ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది.