పవన్ నుంచి సుదీర్ఘ విరామం తర్వాత హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతుంది. భారీ పాన్ ఇండియన్ మూవీ కావడం, పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఏ సినిమాకు లేనంత క్రేజ్ వీరమల్లుకు ఏర్పడింది. ఈ సినిమాకు అన్నిచోట్ల ప్రీమియర్ షోస్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇటు ఏపీలో.. అటు తెలంగాణలోనూ భారీగా టికెట్ రేట్లు కూడా పెంచేశారు. ఇక ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ చూస్తే.. పవన్ రేంజ్ ఏంటో క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడున్న హవా చూస్తే ప్రీమియర్స్‌తోనే వీరమల్లు రికార్డులో ఊచకోత ఖాయం అనేలా కనిపిస్తుంది. బుధవారం రాత్రి 9:30 నుంచి ఏపీలో ప్రీమియర్ షోలు ప్రారంభమవుతున్నాయి.
ఏపీలో ప్రీమియర్ టికెట్ల రేట్లు వెయ్యి రూపాయలు దాటిపోతున్నాయి. కొన్నిచోట్ల అయితే 1500 కి కూడా టికెట్లు అమ్ముతున్న అభిమానులు ఎగబడి తీసుకుంటున్న పరిస్థితి. ఉభయగోదావరి జిల్లాలో అయితే ప్రీమియర్ షోల సౌండ్‌కు పవన్ మానియా ఏంటో అర్ధం అయిపోతుంది. ఇక్కడ 49 సెంటర్లకు.. 47 సెంటర్లలో 127 ప్రీమియర్ షోలు పడుతున్నాయంటేనే వీరమల్లు క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు మరే సినిమాకు ఏ రేంజ్ ప్రీమియర్స్ పడలేదని బయ్యర్లు చెప్తున్నారు. ఇక్కడ టికెట్ రేట్లు 800 నుంచి స్టార్ట్ అయినా.. ప్రీమియర్ షోల టికెట్లు అన్నీ హార్ట్ ఎక్కుల అమ్ముడుపోవడం విశేషం. తూర్పుగోదావరి జిల్లాతో పాటు.. పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్రలోనూ ప్రీమియర్ షోస్ విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో అయితే ఇప్పటికే 116 షోలు వేస్తున్నట్లు సమాచారం.
నెల్లూరు, గుంటూరు, కృష్ణ, రాయలసీమలో కూడా ప్రీమియర్ షోలు భారీగా పడనున్నాయి. ఒక్కో జిల్లాకు ఎంత లేదన్న రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల దాకా ప్రీమియర్స్ నుంచే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో భారీ ప్రీమియర్స్ పడుతున్నాయి. దీంతో అక్కడ కూడా ఎంత లేదన్న రూ.6 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చేస్తాయి. అటు ఏపీ నుంచి రూ.12 కోట్ల ప్రీమియర్స్ నుంచే వచ్చే అవకాశం ఉంది. ఏపీలో రూ.60 కోట్లకు రైట్స్ అమ్మగా.. తొలిరోజే రూ.12 కోట్లకు పైగా వసూలు చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. ఈ లెక్కన ప్రీమియర్ తోనే వీరమల్లు రికార్డుల ఊచకోత మొదలైపోతుంది. ఈస్ట్, వెస్ట్ బీ, సీ సెంటర్స్‌లో ఫస్ట్ డే అన్నిచోట్ల హౌస్ ఫుల్ పడిపోయింది. అంటే అక్కడ యావరేజ్ టాక్ ఉన్నా.. ఫస్ట్ డే బ్లాక్‌బస్టర్ వసూళ్లు వచ్చేసినట్లు.