ప్రీమియర్ షోలతో ” వీరమల్లు ” బ్లాక్ బస్టర్ రికార్డ్.. కలెక్షన్స్ లెక్కలివే..!

టాలీవుడ్ పవ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా తెర‌కెక్కిన‌ లేటెస్ట్ మూవీ హరిహ‌ర‌ వీరమల్లు. బాబి డియోల్ కీలకపాత్రలో.. ఏ.ఎం.రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ మూవీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌లో రూపొందింది. క్రిష్‌ డైరెక్షన్లో మొదలైన ఈ సినిమా ఏ. ఏం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్లో పూర్తయింది. కోహినూర్‌ డైమండ్ బ్యాక్ డ్రాప్‌లో పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా.. హిస్టోరికల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కెన ఈ సినిమాపై.. ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అభిమానులు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక సినిమా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కాగా.. ఫ్యాన్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి భారీగా ప్రీమియర్ షోలు వేశారు. ఇక ఈ ప్రీమియర్ షోలకు టికెట్లు రూ.600.. జీఎస్టీ అదనంగా గవర్నమెంట్ నిర్ణయించింది.

టికెట్ రేట్ ఎంతున్న తమ హీరోని మాత్రం వెండితెరపై చూడాల్సిందే అంటూ ఫ్యాన్స్ తెగ ఆరాటపడిపోయారు. ఇందులో భాగంగానే ప్రీమియర్ షోల టికెట్లు అన్నీ హాట్‌ కేకుల క్షణాల్లో అమ్ముడుపోయాయి. ఏపీ తెలంగాణలోని కొన్ని వందల థియేటర్లో ప్రీమియర్ షోలు వేశారు. ఈ క్రమంలోనే కేవలం ప్రీమియర్ షోల కలెక్షన్‌ల‌తోనే క్రేజీ రికార్డును క్రియేట్ చేశాడు. ట్రేడ్ వ‌ర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోల ద్వారా రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు అసలు రాబట్టిందట. అది పవన్ సినిమాలన్నింటిలోనూ హైయెస్ట్ కలెక్షన్ అని అంటున్నారు. ఇలాంటి క్రమంలో మేకర్స్ సినిమా ప్రీమియర్ షోలా రెస్పాన్స్ కు సంబంధించి అదిరిపోయే పోస్టర్ను రిలీజ్ చేశారు.

హరిహర వీరమల్లు థియేటర్లో ప్రేక్షకులతో నిండిపోతున్నాయని.. బ్లాక్ బస్టర్ అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ ఇదేనంటూ ట్విట్ చేశారు. ప్రీమియర్ షోల ద్వారా ఎంత కలెక్షన్స్ వచ్చేయి అనేది మాత్రం మేకర్స్ రివీల్‌ చేయలేదు. ఇక ఏదేమైనా వీర‌మల్లు సినిమాతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వ‌ర్గాల‌లో టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ సినిమాపై ఉన్న అంచనాలతో ఆయన సులువుగా రూ.100 కోట్ల నెట్టు కలెక్షన్లు కొల్లగొట్టి ఆ లిస్టులోకి చేరతాడు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ ఎదుగుతున్న క్రమంలో.. పవన్ రాజకీయాలపై ఫోకస్ పెట్టి సినిమాల విషయంలో శ్రద్ధ చూపలేకపోయారు. ఈ క్రమంలోనే నిన్న‌టివరకు టాలీవుడ్ హీరోగా మిగిలిన పవన్.. హరిహర వీరమల్లతో పాన్ ఇండియన్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబడుతుందనేది ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిగా మారింది.