కొద్ది గంటల్లో వీరమల్లు గ్రాండ్ రిలీజ్.. ఊహించని చిక్కుల్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ..!

ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరికొద్ది గంటల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్‌కు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ.. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా దాదాపు ఐదు భాషల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్‌లోను భారీ లెవెల్‌లో ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్‌ ఇండియన్ సినిమా కావడం.. అలాగే సుదీర్ఘ గ్యాప్ తర్వాత పవన్ వెండితెరపై కనిపిస్తున్న‌ సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక.. దాదాపు 5 ఏళ్లకు పైగా సెట్స్‌పై నడిచిన ఈ సినిమా.. ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. ఎన్నో అవరోధాలు, అడ్డంకులను దాటుకొని ఆడియన్స్‌ను పలకరించింది. సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో ఆడియన్స్‌లో హైప్‌ పెంచేలా మేకర్స్ ప్లాన్ చేస్తూ వచ్చారు.

ఇక‌ సినిమాల ప్రమోషన్లకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ సైతం.. డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సరే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హాజరవ‌డం విశేషం. ముఖ్యంగా తానే స్వయంగా ప్రెస్మీట్‌లు ఏర్పాటు చేసి మరి హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. ఇప్పుడు వైజాగ్లో మరో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ తెగ ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. కాగా.. మరో పక్క సోషల్ మీడియాలో వీరమల్లు పై నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు వీరమల్లు సినిమాను టార్గెట్ చేస్తూ తెగ ట్రోల్స్‌ చేస్తున్నారు. నిజమైన రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎవరు కూడా ఈ సినిమాను అసలు చూడనే చూడకూడదంటూ.. గట్టిగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కనపడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో హాట్ టాపిక్ గా మారింది. అందులో హరిహర వీరమల్లు సినిమా డైరెక్టర్ జ్యోతి కృష్ణ పోలీసులతో కనిపించడం మరింత చర్చనీయాంశంగా వైరల్ అవుతుంది.

హైదరాబాద్‌లో తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలుతో ఈవెంట్ కు అనుమ‌తులు ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ఓవర్ క్రౌడ్ రాకుండా బాధ్యతలు నిర్మాతలు తీసుకున్నారు. ఎలాంటి ఆవంత్రాలు లేకుండా చాలా ప్రశాంతంగా ఈవెంట్ ముగిసింది. కానీ.. జ్యోతి కృష్ణ మంత్రం ఊహించని సమస్యలో చిక్కుకున్నాడు. శిల్పకళ వేదిక బయట వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణకు.. పోలీసులకు మధ్య చిన్న వివాదం తలెత్తిందట. దీంతో పోలీసులపై ఆయ‌న ఫైర్‌ అయిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. పోలీసులు కారుని ఆపడంతో ఆయన కిందకు దిగ్గి.. పోలీసులతో గొడవ పడినట్లు కనిపిస్తుంది. ఎప్పుడు సైలెంట్ గా ఉండే ఆయన గొంతు పెద్దది చేసి ఆరవడం వీడియోలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు వీడియోలను నెగిటివ్గా ట్రోల్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు. ఈ నెగిటివిటీతో కలెక్షన్లపై కూడా ఎఫెక్ట్ పడుతుందేమో చూడాలి.