టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డీప్యూటీ సీఎంగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు ఇది పెద్ద పండుగనే చెప్పాలి. ఈ నెల 24న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ను గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ నెల 19న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట టీం. దీనికి సంబంధించిన స్పష్టమైన క్లారిటీ రాకున్నా.. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ టాక్ తెగ వైరల్‌గా మారుతుంది.
భారీ వర్ష సూచనలు కనిపిస్తున్న క్రమంలో.. వాతావరణం సహకరిస్తే అవుట్డోర్ స్టేడియంలో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనున్నారట. లేదంటే.. ఇండోర్‌లోనే ఈవెంట్ ముగిస్తామని.. ఏ.ఏం.రత్నం తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. అయితే.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్ గెస్ట్స్‌గా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్‌ని పిలవాలని నిర్మాత ఏ.ఎం. రత్నం భావిస్తున్నాడట. మేకర్స్ అనుకున్న సమయానికి ఇద్దరు సూపర్ స్టార్ల డేట్స్ ఖాళీ ఉంటే మాత్రం.. కచ్చితంగా ఇద్దరిని ఫ్రీ రిలీజ్‌కు తీసుకువచ్చేసేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇక అన్ని అనుకున్నట్లు జరిగి ఇద్దరు సూపర్ స్టార్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేస్తే మాత్రం సినిమాకు నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక.. ఇటీవల చెనైకి వెళ్లిన రత్నం.. హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే సినిమా బిజినెస్ మొత్తాన్ని క్లోజ్ చేస్తాడని తెలుస్తుంది. ఇక.. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం.. సినిమాపై ఆడియన్స్‌లో మరింత హైప్ పెంచుతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం పవన్‌కు పాన్ ఇండియా లెవెల్లో మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందరటంలో సందేహం లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.