టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటివరకు ఒక సినిమాతో కూడా పాన్ ఇండియన్ ఆడియన్స్‌ను పలకరించని త్రివిక్రమ్.. మొదటిసారి కుమారస్వామి జీవిత గాధతో ఆడియన్స్‌ను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. మురుగన్ లైఫ్ స్టోరీలోని కొన్ని కీలక ఘట్టాలను తీసుకొని.. అల్లు అర్జున్‌తో భారీ మైథాలజికల్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తీయాలని ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. కానీ.. బన్నీ ఈ సినిమాను హోల్‌డ్‌లో పెట్టి.. అట్లీ సినిమా వైపుకు వెళ్ళిపోయాడు. దీంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.
అయితే.. బన్నీకి చాలా కాలం టైం పడుతున్న నేపథ్యంలో.. ఈ స్క్రిప్ట్ కోసం ఎన్టీఆర్‌ను అప్రోచ్ అయ్యాడట త్రివిక్రమ్. ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో కుమారస్వామి జీవిత కథ ఆధారంగా ఒక్క సినిమా కూడా రాలేదు. పైగా.. కుమారస్వామి లైఫ్ స్టోరీలో చాలా ఆసక్తికర లైన్ త్రివిక్రమ్ సినిమాగా తీయాలని భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమా చేసేందుకు తారక్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన వార్ 2.. వచ్చే నెల 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అంతేకాదు.. ఆయన ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూట్ పూర్తైన వెంటనే త్రివిక్రమ్ సినిమా కోసం తారక్ సిద్ధమవుతాడట.
ఇక ఈ క్రమంలోనే కుమారస్వామి చరిత్రపై ఎన్టీఆర్ అవగాహన పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు తారక్. రీసెంట్గా ఎయిర్పోర్ట్‌లో ఆయన మురుగన్ బుక్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. కార్తికేయ పోరాటానికి సంబంధిచిన పుస్తకమది. దీంతో ఈ పుస్తకంలో త్రివిక్రమ్ ఎంచుకున్న కథ కూడా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. తారకాసురుడు అనే బ్రహ్మ రాక్షసుడిది కుమారస్వామిని అంతం చేయడం కూడా ఆయన చరిత్రలో ఓ భాగం. ఈ భాగానే సినిమా కథగా త్రివిక్రమ్ డిసైడ్ చేస్తున్నట్లు సమాచారం.
తారకాసుర సంహారం తర్వాతే.. కుమారస్వామిని దేవతల సైన్యాధిపతిగా నియమించాడు శివుడు. అదే కథతో త్రివిక్రమ్, తారక్ ఆడియన్స్‌ను పలకరించనున్నారని తెలుస్తుంది. ఇది పూర్తి మైథలాజికల్ మూవీగా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు. ఇక ఎప్పటినుంచో ఓ మైథలాజికల్ క్యారెక్టర్‌లో తారక్‌ను చూడాలని ఆరాటపడుతున్న ఫ్యాన్స్. ప్రస్తుతం స్టోరీ లైన్ లీక్ అవ్వడంతో సినిమాపై మరింత ఆసక్తి చూపుతున్నారు. ఇక పూర్తి వివరాలు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.